కోల్ కతాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు | Indian cricketers arrive in city for 4th ODI | Sakshi
Sakshi News home page

కోల్ కతాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

Nov 11 2014 12:22 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా ఆటగాళ్లు కోల్ కతా కు చేరుకున్నారు.

కోల్ కతా: శ్రీలంకతో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా ఆటగాళ్లు మంగళవారం కోల్ కతా నగరానికి చేరుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగునున్ననాల్గో వన్డేలో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు  కోల్ కతాకు చేరుకున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో సహా చివరి రెండు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు బుధవారం ఇక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక ఆటగాళ్లు గత రాత్రి నగరానికి చేరుకున్నారు. గురువారం టీమిండియ-శ్రీలంకల మధ్య నాల్గో వన్డే జరుగునుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కొన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.

 

మూడు వన్డేల్లో విశేషంగా రాణించిన శిఖర్ ధవన్ విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు రోహిత్ శర్మను మిగతా రెండు వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్ తో పాట రాబిన్ ఉతప్ప, కరణ్ శర్మ, వినయ్ కుమార్, కేదర్ యాదవ్ లు తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement