
రో'హిట్'... శ్రీలంక ఫట్
రోహిత్ శర్మ రికార్డ్ డబుల్ సెంచరీ తోడు, బౌలర్లు విజృంభించడంతో నాలుగో వన్డేలో శ్రీలంకపై భారత్ 153 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కోల్కతా: రోహిత్ శర్మ రికార్డ్ డబుల్ సెంచరీ తోడు, బౌలర్లు విజృంభించడంతో నాలుగో వన్డేలో శ్రీలంకపై భారత్ 153 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 405 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన లంక 43.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ భారత్ కు 4-0 ఆధిక్యం దక్కింది.
శ్రీలంక ఆటగాళ్లలో మాథ్యూస్(75) తిరిమానె( 59) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లి అర్థ సెంచరీ(66) సాధించాడు. సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.