బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో నాలుగో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. భువి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు హేల్స్, కుక్ను పెవలియన్ బాటపట్టించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువి హేల్స్ను బౌల్డ్ చేయగా, కుక్.. రైనాకు క్యాచిచ్చాడు.
దీంతో ఇంగ్లీష్ మెన్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ షమీ ఆ వెంటనే బాలెన్స్ను అవుట్ చేసి ఇంగ్లండ్ కోలుకోనీకుండా చేశాడు. ఇంగ్లండ్ 8 ఓవర్లలో 23 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మోర్గాన్, రూట్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేసినా నింపాదిగా ఆడారు. భారత బౌలర్లు మోర్గాన్, రూట్ ను వెంటవెంటనే అవుట్ చేశారు. ఇంగ్లండ్ 33 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి116 పరుగులు చేసింది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.
రెచ్చిపోతున్న భారత బౌలర్లు
Published Tue, Sep 2 2014 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement