'కుమార సంగక్కర గొప్ప ఆటగాడేమీ కాదు'
లండన్: ఈ మధ్యే ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ లో విశేష ప్రతిభ కనబరిచి శ్రీలంకను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన కుమార సంగక్కర గొప్ప ఆటగాడేమి కాదంటూ దుర్ హామ్ కౌంటీ కోచ్ జాన్ లూయిస్ అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగక్కర దుర్ హామ్ జట్టు తరుపున దిగడానికి సంతకం చేయబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో లూయిస్ ఈ మేరకు స్పందించారు. అతను(సంగక్కరా) దుర్ హామ్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూనే, ప్రపంచలో అతను చెప్పుకోదగ్గ ఆటగాడేమీ కాదని తెలిపారు. సంగక్కరాను దుర్ హామ్ కు ప్రాతినిధ్యం వహిస్తాడన్న వార్తలపై మాత్రం జట్టు యాజమాన్యం అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
గత 2007 లో వార్విక్ షైర్, 2010లో లాంక్ షైర్ కౌంటీ జట్లుకు సంగక్కర సంతకం చేసినా ఆడటకపోవడంతో ప్రస్తుత జట్టు మేనేజ్ మెంట్ అది పునరావృతం కాకుండా ఉండే విధంగా చూసుకుండేదుకు యత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ట్వంటీ 20ల నుంచి వైదొలిగిన సంగక్కర ప్రస్తుత యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కూడా దూరంగా ఉన్నాడు.