
బేగరి ప్రమీల (ఫైల్)
నిజాంపేట్: కోకకోలా చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నర్సు మృతి చెందింది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే గురువారం మరొకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్ ఓమేగా హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న బేగరి ప్రమీల (24)జూబీహిల్స్‌లో ఓ ఉమెన్స్ హాస్టల్‌లో ఉండేది. లాక్‌డౌన్ కారణంగా బొల్లారంలో ఉండే బంధువుల ఇంట్లో ఉంటూ ప్రతిరోజు డ్యూటీకి బొల్లారం నుండి జూబ్లీహిల్స్ ఆస్పత్రికి వెళ్తోంది. (నర్సుగా సేవలందించిన తనకే..)
గురువారం ఉదయం 7.15గంటలకు బావ బేతయ్యతో కలిసి ప్రమీల బొల్లారం నుంచి జూబ్లీహిల్స్‌కు మోటార్ బైక్ (టీఎస్ 15 ఇజెడ్ 9335) పై వెళుతోంది. కోకకోలా చౌరస్తా దాటిన తరువాత లహరి కన్‌స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 07 యూడి 0003) బైక్ ను కుడి వైపు తగిలించగా బైక్‌పై ఉన్న ప్రమీల, బేతయ్యలు రోడ్డుపై పడ్డారు. ట్రావెల్స్ బస్సు ప్రమీద తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బేతయ్యకు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమీల తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం బాచుపల్లి నుంచి మల్లంపేట్‌కు ద్విచక్ర వాహనంపై తన బావతో కలిసి వెనక కూర్చున్న మహిళ నాగ సృజన బైక్ స్కిడ్ కావడంతో కింద పడింది. దీంతో పక్కనుంచి వెళ్తున్న టప్పిర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.
వరుస ప్రమాదాలు..
గత రెండు రోజులుగా బాచుపల్లి, మేడ్చల్, పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదాలు భారీ వాహనాలు ఢీకొట్టడం మూలంగా, బైక్‌లు జారి పడి, సడెన్ బ్రేక్‌లు వేయడం వల్లనే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటనలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment