లండన్: వాయువ్య ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది.
కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది.
పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు.
లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు.
ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment