క్యాథరిన్ జోన్స్
లండన్ : డాక్టర్ల తప్పు ఓ నిండు ప్రాణం బలికొంది. తాను పనిచేస్తున్న ఆసుపత్రి వైద్యుల కారణంగానే ఓ నర్సు మరణించింది. భార్య మరణానికి నిజమైన కారణాలను అన్వేషిస్తూ పోరాటం చేసిన నర్సు భర్త ఎట్టకేలకు విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని నార్త్ వేల్స్‌కు చెందిన క్యాథరిన్ జోన్స్ 35 అనే నర్సు 2013లో తాను పనిచేస్తున్న వ్రేక్సహామ్ మేలర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. క్యాన్సర్ కణితిని తొలిగించిన వైద్యులు ఇకపై ఎలాంటి సమస్య రాదని చెప్పారు. అయితే మూడు సంవత్సరాల తర్వాత 2016లో క్యాన్సర్ కణితి మరింత పెద్దదైంది. (2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..)
అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించగా కణితి పెద్దదైన విషయం బయటపడింది. ఆ ఏడాది నవంబర్ నెలలోనే క్యాథరిన్ మరణించారు. అయితే తన భార్య చావుకు గల నిజమైన కారణాలను చెప్పాలంటూ క్యాథరిన్ భర్త డేవిడ్.. ‘‘బెట్సీ కాడ్వలర్డర్ యూనివర్శిటీ హెల్త్ బోర్డు’’పై పోరాటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఆసుపత్రి యజమాన్యం తమ తప్పును ఒప్పుకుంది. ఆమెకు సరైన చికిత్స అంది ఉంటే బ్రతికుండేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment