lifetime imprisonment
-
విశాఖ పొక్సో కోర్టు సంచలన తీర్పు
విశాఖ: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధించి సంచలన తీర్పునిచ్చింది విశాఖ పోక్సో కోర్టు. 2020లో మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రరావు అనే కసాయి తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి బంధువులు 2020, అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా విశాఖ పోక్సో కోర్టులో విచారణ జరిగింది. మూడేళ్లపాటు జరిగిన విచారణానంతరం ఈరోజు ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రామచంద్రరావుకు జీవితఖైదును విధించడంతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరగడంతో స్పెషల్ పొక్సో కోర్టు ప్రాసిక్యూటర్ కరణం కృష్ణకి కన్నీటితో కృతఙ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబసభ్యులు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం -
కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..?
లండన్: వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
సిమి మాస్టర్ మైండ్ సహా 11మందికి జీవితఖైదు
ఇండోర్: సిమి అగ్రనేత, మాస్టర్ మైండ్ సప్ధర్ నగోరి సహా 11 మంది సిమి ఉగ్రవాదులకు ఇండోర్ జిల్లా కోర్టు సోమవారం జీవితఖైదు విధించింది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండటంతో పాటు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో దోషులుగా ఉన్న వీరికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. 2008లో జరిగిన వరుస పేలుళ్ల రూపకల్పనలో నగోరి కీలకపాత్ర పోషించాడు. ఈ పేలుళ్లలో సుమారు 57మంది మృతి చెందారు. కాగా నగోరి అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.