
విశాఖ: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధించి సంచలన తీర్పునిచ్చింది విశాఖ పోక్సో కోర్టు.
2020లో మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రరావు అనే కసాయి తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి బంధువులు 2020, అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా విశాఖ పోక్సో కోర్టులో విచారణ జరిగింది.
మూడేళ్లపాటు జరిగిన విచారణానంతరం ఈరోజు ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రామచంద్రరావుకు జీవితఖైదును విధించడంతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరగడంతో స్పెషల్ పొక్సో కోర్టు ప్రాసిక్యూటర్ కరణం కృష్ణకి కన్నీటితో కృతఙ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబసభ్యులు.
ఇది కూడా చదవండి: తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం
Comments
Please login to add a commentAdd a comment