ఫోన్‌ మాట్లాడుతూ ఒకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ | Nurse Gives At A Time Double Dose Corona Vaccine In Rangareddy | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడుతూ ఒకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌

Published Sat, Jun 19 2021 10:32 AM | Last Updated on Sat, Jun 19 2021 10:59 AM

Nurse Gives At A Time Double Dose Corona Vaccine In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. అదే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. ఓ నర్స్‌ నిర్లక్ష్యంతో ఓ యువతికి ఓకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్‌లో చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న(21) అనే ఓ యువతి కరోనా టీకా కోసం జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లింది.

దీంతో ఆ యువతికి నర్స్ పద్మ.. ఫోన్ మాట్లాడుకుంటూ రెండు డోసుల కరోనా టీకా ఇచ్చింది. వ్యాక్సిన్‌ అనంతరం ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

చదవండి: COVID-19: గణనీయంగా తగ్గుతున్న రోజువారీ కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement