
స్టాఫ్‌నర్స్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
అనంతపురం సెంట్రల్: తల్లిదండ్రులకు భారం కాకూడదని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ షాషా మున్నీ (28) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలోని కళావతమ్మ కాలనీలో నివాసముంటున్న మహమ్మద్, రమీజా దంపతుల కుమార్తె షాషామున్నీ కొన్నేళ్లుగా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. కుటుంబ బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్న ఈమె ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి కూడా చేసింది. ఇటీవల స్నేహితురాలి పెళ్లి కోసం చైన్నై వెళ్లి వచ్చింది.
ఏమైందో తెలియదుకానీ రెండు రోజులుగా తనలో తానే కుమిలిపోయింది. తనకు పెళ్లి సంబంధం కుదరలేదని కలత చెందింది. మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. బుధవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా తలుపులు తెరిచారు. అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించింది. వివాహం కాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆస్పత్రి వర్గాలు దిగ్భ్రాంతి
స్టాఫ్‌నర్స్ షాషా మున్నీ ఆత్మహత్య విషయం తెలియగానే ఆస్పత్రి వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మార్చురీలో ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథం, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలత, స్టాఫ్‌నర్స్ అసోసియేషన్ నాయకురాలు భాగ్యరాణి, జానకి, సావిత్రి, శ్రీదేవి, ఆషా, సుజిత తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు.
నన్ను క్షమించండి
డబ్బులన్నీ వేస్ట్ చేశాను. మీకు భారంగా ఉండటం ఇష్టం లేదు. మనసులో భయం, బాధ వేసే ఇలా చేస్తున్నాను. నన్ను బాగా చూసుకున్న మీకు ఏమీ చేయలేకపోతున్నా. అమ్మానాన్నా నన్ను క్షమించండి.
– సూసైడ్ నోట్‌లో షాషామున్నీ
Comments
Please login to add a commentAdd a comment