Contract staff
-
గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ జరగలేదు
గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ జరగలేదని, కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ గుండెపోటుతోనే మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజా రావు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలి పారు. గాంధీ ఆస్పత్రి సెల్లార్లో కొంత మంది కాంట్రాక్టు సిబ్బంది ఈ నెల 16న రాత్రి మందు పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లారని, వారిలో శ్రీనివాస్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఇంటికి వెళ్లిన తర్వాత వేకువజామున మృతి చెందాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలి సిందే. దీంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఐదుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఆర్ఎంఓ–1 జయకృష్ణ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్ధో పెడిక్, ఆప్తమాలజీ హెచ్ఓడీలు సుబోధ్ కుమార్, సత్యనారాయణ, రవిశేఖర్, ఫల్మ నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ నరేంద్ర కుమార్‌లు ఉన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలోని సెమినార్ హాలులో ఘటన జరిగిన రోజు రాత్రి విధులు నిర్వహించిన పలువురు కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో మందు పార్టీ జరగ లేదని ఆస్పత్రి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసిందని ఆస్పత్రి సూపరింటెం డెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు. -
‘గాంధీ’లో మందు పార్టీ
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే, కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో అర్ధరాత్రి వరకు పూటుగా తాగి తందనాలాడారు. వేకువజామున ఇంటికి వెళ్లిన వీరిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపింది. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోదరులైన శ్రీనివాస్, నరేష్, నగేష్ కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్‌లోని సీఎస్డీ విభాగానికి చెందిన గదిలో వీరు ముగ్గురితో పాటు మరో ఇద్దరు కలిసి మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. అనంతరం అవుట్సోర్సింగ్ ఉద్యోగితో మరో ఫుల్‌బాటిల్ తెప్పించుకుని అర్ధరాత్రి వరకు తాగి, వేకువజామున ఇళ్లకు వెళ్లారు. ఇంటికి వెళ్లాక ముగ్గురు సోదరుల్లో ఒకడైన శ్రీనివాస్ (38) హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు భావించారు. మృతుడు శ్రీనివాస్ ఆస్పత్రి స్టెరిలైజేషన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ మృతితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలో మందు పార్టీ చేసుకున్నట్టు ఆస్పత్రి అధికారులకు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, శ్రీనివాస్ మృతిపై ఫిర్యాదు అందలేదని ఆస్పత్రి అధికారులు చెప్పారు. మూడంచెల భద్రత ఏమైంది? గాంధీ ఆస్పత్రిలో 300 మంది పోలీసులతో మూడంచెల భద్రత వ్యవస్థ ఉంది. వీరుకాక, మరో వంద మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరి కళ్లుగప్పి ఆస్పత్రి ప్రాంగణంలోకి మద్యం బ్యాటిళ్లు రావడం గమనార్హం. ఆస్పత్రి సెల్లార్లో మద్యం విందు జరిగినట్టు దృష్టికి వచ్చిందని డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావునేత, ఆర్ఎంఓ జయకృష్ణ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. విచారణ జరుపుతాం ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్లో కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం విందు చేసుకున్న విషయమై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి విచారణ చేపడతాం. వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది ఇలాంటి పనులతో చెడ్డపేరు తెస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సెల్లార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. సెల్లార్లో ఉన్న తుక్కును తరలించి, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ది, అక్కడ కొన్ని వైద్య విభాగాలను ఏర్పాటు చేసే యోచన ఉంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
తిరుమల లడ్డూ కౌంటర్లలో కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం
-
నన్ను క్షమించండి
అనంతపురం సెంట్రల్: తల్లిదండ్రులకు భారం కాకూడదని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ షాషా మున్నీ (28) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలోని కళావతమ్మ కాలనీలో నివాసముంటున్న మహమ్మద్, రమీజా దంపతుల కుమార్తె షాషామున్నీ కొన్నేళ్లుగా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. కుటుంబ బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్న ఈమె ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి కూడా చేసింది. ఇటీవల స్నేహితురాలి పెళ్లి కోసం చైన్నై వెళ్లి వచ్చింది. ఏమైందో తెలియదుకానీ రెండు రోజులుగా తనలో తానే కుమిలిపోయింది. తనకు పెళ్లి సంబంధం కుదరలేదని కలత చెందింది. మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. బుధవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా తలుపులు తెరిచారు. అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించింది. వివాహం కాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వర్గాలు దిగ్భ్రాంతి స్టాఫ్‌నర్స్ షాషా మున్నీ ఆత్మహత్య విషయం తెలియగానే ఆస్పత్రి వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మార్చురీలో ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథం, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలత, స్టాఫ్‌నర్స్ అసోసియేషన్ నాయకురాలు భాగ్యరాణి, జానకి, సావిత్రి, శ్రీదేవి, ఆషా, సుజిత తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు. నన్ను క్షమించండి డబ్బులన్నీ వేస్ట్ చేశాను. మీకు భారంగా ఉండటం ఇష్టం లేదు. మనసులో భయం, బాధ వేసే ఇలా చేస్తున్నాను. నన్ను బాగా చూసుకున్న మీకు ఏమీ చేయలేకపోతున్నా. అమ్మానాన్నా నన్ను క్షమించండి. – సూసైడ్ నోట్లో షాషామున్నీ -
బాబు వచ్చారు..జాబులు తీసేశారు
-
'గాంధీ' లో కొనసాగుతున్న కాంట్రాక్టు సిబ్బంది సమ్మె
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ఆదివారం కూడా తమ సమ్మెను కొనసాగించారు. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తు గాంధీ ఆస్పత్రిలో అవుట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 200 మంది కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన ఆదివారం ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వస్తే తీసుకుంటాం..రాకపోతే తీసేస్తాం...
రాజమండ్రి : ఆర్టీసీ సమ్మెతో విధులకు దూరంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరైతే.. వారిని క్రమబద్ధీకరణ చేస్తామని, లేకపోతే విధుల నుంచి తొలగిస్తామని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. గురువారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రంలోపు విధులకు హాజరు కావాలని.. అలాంటి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేస్తామని రవికుమార్ తెలిపారు. కాగా ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
గుంతకల్లు డిపో ఎదుట ఉద్రిక్తత
అనంతపురం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలకు పలు కార్మిక సంఘాలు విఘాతం కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపో నుంచి గురువారం ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు బస్సులను ప్రైవేటు సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు వచ్చి ప్రైవేటు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడి చేయడానికి యత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టెందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
చేతివాటం చూపబోయి దొరికిపోయాడు
టీకప్పులో బంగారు చైను, మంగళసూత్రాలు తరలిస్తూ పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి లక్ష రూపాయల విలువైన హుండీ సొత్తు స్వాధీనం ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మ హుండీ సొత్తును లెక్కించేందుకు వచ్చిన కాంట్రాక్టు సిబ్బందిలో ఒకరు మంగళసూత్రాలు, గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దుర్గామల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం భవానీదీక్షా మండపంలో నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బందితోపాటు కేశఖండనశాలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం సుమారు 10.10 గంటలకు ఒక్కొక్కరూ బయటకు వచ్చి టీ తాగుతున్నారు. దుర్గాఘాట్‌లోని కేశఖండనశాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే ఎం.రామసుబ్బారావు కూడా వారిలో ఉన్నాడు. రామసుబ్బారావు టీ తాగుతూ మధ్యలో లోనికి వెళ్లి, కానుకలు లెక్కించేందుకు కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు టీకప్పుతో సహా కిందకు దిగేందుకు యత్నించాడు. రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది సూచించారు. దీంతో టీకప్పును మెట్ల పక్కనే ఉన్న గోడ వద్ద పెట్టి రిజిస్టర్లో సంతకం చేశాడు. తరువాత ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపారు. అతడు నేరుగా కిందకు వెళ్లకుండా మెట్ల పక్కన ఉంచిన టీకప్పును తీసుకువెళ్లేందుకు యత్నించాడు. మెట్ల వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ టి.శివప్రసాద్‌కు అతడి తీరుపై అనుమానం వచ్చింది. మరోమారు తనిఖీ చేసేందుకు రామసుబ్బారావును వెనక్కి పిలిచాడు. దీంతో అతడు టీకప్పును మెట్ల మధ్యలో పెట్టి పైకి వచ్చా డు. తనిఖీ చేసిన తరువాత కిందకు దిగేందుకు రామసుబ్బారావు కంగారు పడుతున్నాడు. టీకప్పు పైకి తీసుకురావాలని ఎస్పీఎఫ్ సిబ్బంది పిలవగా, అతడు లెక్కచేయకుండా వేగంగా కిందకు దిగేందుకు యత్నించాడు. శివప్రసాద్ వెంటపడి టీకప్పుతో సహా అతడిని పైకి తీసుకువచ్చాడు. కప్పును తనిఖీ చేయగా, మంగళసూత్రాలు, బంగారు గొలుసు కనిపించాయి. దీంతో భద్రతా సిబ్బంది ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి సీసీ టీవీల పుటేజీని పరిశీలించారు. అనంతరం రామసుబ్బారావును విచారణ చేశారు. అతడు చోరీ చేసేందుకు యత్నించిన 40 గ్రాముల బంగారు గొలుసు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని నిర్ధారించుకున్నారు. అనంతరం రామసుబ్బారావును పోలీస్ అవుట్‌పోస్టులో అప్పగించగా, అక్కడి సిబ్బంది వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు. -
‘బోనస్’ కటింగ్..!
* ఎన్నికలకు ముందు కాంటాక్ట్ సిబ్బందికి రూ.11 వేలు బోనస్ ఇస్తామన్న ఎన్‌ఎంఎంసీ * ఎన్నికలతర్వాత ఇచ్చింది రూ.5,900 * రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని బుకాయింపు * నిరాశలో 4 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది * ఓట్ల కోసమే తమను మభ్యపెట్టారని ఆరోపణ సాక్షి, ముంబై : నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) కాంట్రాక్ట్ సిబ్బందికి రూ.11 వేలను బోనస్‌గా ప్రకటించి కేవలం రూ.5,900 మాత్రమే ఇవ్వడంతో సిబ్బంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్ఎంఎంసీలో దాదాపు 6,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో కేవలం 2,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతా వారంతా కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంత అధిక మొత్తంలో బోనస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరమని, వారి అనుమతి లేకుండా తాము ఏమీ చేయలేమని కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో బోనస్‌ను సవరించామని డిప్యూటీ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తమకు రూ.11 వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించారని, కానీ దానిని సవరించి కేవలం రూ.5,900 మాత్రమే ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఒక్కో కాంట్రాక్ట్ వర్కర్‌కు రూ.11 వేల బోనస్‌ను ప్రకటించింది. ఎన్‌ఎంఎంసీ పరిపాలన విభాగం మొదట రూ.5,000 బోన్‌ను ఇచ్చేందుకు సూచించింది. స్టాండింగ్ కమిటీ రూ.5,500 సిఫార్సు చేసింది. కానీ జనరల్ బాడీ ఈ బోనస్‌ను రూ.11,000కు పెంచింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ కార్పొరేషన్ చేతులెత్తేసిందని సిబ్బంది వాపోతున్నారు. ఎన్‌ఎంఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ ఈ అంశమై స్పందిస్తూ... కాంట్రాక్ట్ సిబ్బందికి తాము అధిక మొత్తంలో బోనస్‌ను మంజూరు చేసిన విషయం నిజమే అయినప్పటికీ దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వారి అనుమతి లేనిదే తాము ఈ ప్రతిపాదనతో ముందుకు సాగలేమన్నారు. దీంతో తాము ఈ బోనస్‌ను సవరించి రూ.5,900 తగ్గించామన్నారు. ఎన్నికల ముందే బోనస్‌ను మంజూరు చేశారని, ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటు వేయడం కోసం ఇలా బోనస్ పేరుతో ఎర వేశారని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా, కార్పొరేషన్ పర్మినెంట్ ఉద్యోగికి రూ.13 వేలు బోనస్ మంజూరు చేసింది. కానీ స్టాండింగ్ కమిటీ దీనిని రూ.13,400 పెంచగా జనరల్ బాడీ రూ.14 వేలకు పెంచింది. -
ఉంటుందా..ఊడుతుందా..!
కెరమెరి : వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒప్పంద కాలం ఈనెల 30తో ముగియనుంది. వీరిని అలాగే కొనసాగిస్తారా..తొలగిస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏఏ శాఖల్లో ఉన్నారంటే.. అన్ని మండలాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ, ఉపాధి హామీ పథకం, మున్సిపల్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ఆర్వీఎం,లతోపాటు వైద్యఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, జీఎంలు ,సంక్షేమశాఖ హాస్టల్లో కుక్‌లు, కామాటీలు, వాచ్మెన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నెకల్ అసిస్టెంట్లు , కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రపతిపాలనలో జీవో 84 జారీ రాష్ర్టపతి పాలనలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసుకు సంబంధించి జీవో నం 84 ను జారీ చేశారు. జూన్ 30 తేదీ వరకు సేవలు వినియోగించుకోవాలని ఉమ్మడి రాష్ర్ట ఖజానా ద్వారానే వేతనాల చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. విభజన జరిగిన త ర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే వీరి కొనసాగింపు ఉంటుందని అందులో స్పష్టం చేశారు. తెలంగాణలోని సిబ్బందిని రెన్యూవల్ చేస్తూ చేస్తూ పొడిగిస్తే తప్పా జూలై 1 నుంచి విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై వేలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. -
ఉద్వాసన !
గృహనిర్మాణ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిపై వేటు 120 మంది తొలగింపునకు జీవో రోడ్డున పడనున్న కుటుంబాలు ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు ‘జాబు కావాలంటే ... బాబు రావాలని’ ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదర గొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న జాబులకే భద్రత లేకుండా పోతోంది. చేస్తున్న చిన్నపాటి జాబూ చేజారిపోతుందనే అభద్రతా భావంతో కాంట్రాక్టు సిబ్బంది నలిగిపోతున్నారు.. తమ పరిస్థితి ఏమవుతుందోనని వారం రోజులుగా కుటుంబ సభ్యులంతా కుమిలిపోతున్నారు.. ఇదీ గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల దుస్థితి. గుడివాడ : జిల్లా గృహనిర్మాణ శాఖలో వర్క్ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ మండలాల్లో 120 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో వర్క్ ఇన్స్పెక్టర్లు 108 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 12 మంది ఉన్నారు. ఏడున్నరేళ్లుగా వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిని 2007 జనవరిలో జిల్లా సమాఖ్య ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోగా రెండేళ్ల క్రితం ఎం.కె. ఎంటర్ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు మార్చారు. వీరికి వచ్చేది చిరు జీతమే. నెలకు రూ.9,200 తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూర్తిస్థాయిలో భాగస్వాములుగా ఉంటారు. నిరుపేదలను గుర్తించటం, వారిని ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించటం వంటి విధులు నిర్వహిస్తుంటారు. స్టేజీల వారీగా జరిగిన పనులకు బిల్లులు చేయించే విషయంలో వర్క్ ఇన్స్పెక్టర్లదే కీలక భూమిక. బాబు వస్తే పర్మినెంటు అవుతుందనుకుంటే... చంద్రబాబు వస్తే తమ కాంట్రాక్టు జాబులు పర్మినెంటు అవుతాయని ఈ చిరుద్యోగులు ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. అసలుకే ఎసరు పెడుతూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30 తరువాత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వం మెమో జారీ చేయటం వారి ఆయా కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. రోడ్డున పడనున్న 120 కుటుంబాలు... ఉద్యోగుల జోలికి వెళ్లనని ఎన్నికల ముందు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు నేడు అధికారంలోకొచ్చాక వారిని తీవ్ర అభద్రతా భావానికి గురిచేస్తున్నారని గృహనిర్మాణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని ఎప్పటికైనా పర్మినెంటు కాక పోతుందా అనే ఆశతో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నామని, తీరా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్నే ఊడగొట్టే నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి బతుకుతున్న తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. బాబు వస్తే జాబు సంగతి ఏమో గానీ.. ఉన్న జాబు పోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏడున్నరేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే..
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి రాగానే తన అసలు రూపం బయటపెట్టారు. ఉద్యోగం మాట దేవుడెరుగు.. ఉన్న చిరుద్యోగం కూడా ఊడబెరికేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదర్శ రైతులు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధమవుతుండటం ఎన్నో జీవితాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు వ్యవస్థను టీడీపీ నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సమీక్షిస్తూ రద్దు దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై మొదటగా కత్తి పెడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 1,658 మంది ఆదర్శ రైతులు పని చేస్తుండగా.. ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి పనుల నిర్వహణలో వీరే కీలకం. ఆదర్శ రైతలు, ఫీల్డ్ అసిస్టెంట్లలో అధిక శాతం కాంగ్రెస్ కార్యకర్తలే పని చేస్తున్నారనేది టీడీపీ నేతల భావన. ఆ మేరకు ఈ పోస్టులను రద్దు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనగా ఆందోళన బాట పట్టేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా అన్ని శాఖల్లో కలిపి జిల్లాలో దాదాపు 30వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈనెల చివరితో ముగియనుంది. ప్రభుత్వం వీరి కాంట్రాక్టు పొడిగిస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు శాఖల్లో వీరిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. -
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
- తొలిరోజు మిశ్రమ స్పందన - ఉన్నతాధికారులతో చర్చలు విఫలం - సమ్మె కొనసాగిస్తామంటున్న ఉద్యోగులు విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉన్నప్పటికీ అది జరగకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో విద్యు త్ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 825 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 300 మంది కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్లినట్లు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్ పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతున్న విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు తొలిరోజు సమ్మెకు సహకరించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీచిన ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగటంతో పలుచోట్ల మరమ్మతు పనులకు ఉద్యోగులు హాజరైనట్లు సమాచారం. తొలిరోజు ఆది వారం సెలవు దినం కావటంతో ఎవరూ సమ్మెలోకి వచ్చింది, ఎవరూ విధులు నిర్వర్తిస్తున్నది తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులే పేర్కొం టున్నారు. తొలి రోజు సమ్మెను నిలువరించేందుకు భావి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి, విద్యుత్ శాఖ సీఎండీలు విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. పీఆర్సీ అమలు పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోవటంతో సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుం డా సమ్మెలో భాగంగా తొలిరోజు ఆదివారం దాసన్నపేటలో గల విద్యుత్ సహకార సంఘ భవనం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జి. శివకుమార్ మాట్లాడుతూ వేతన సవరణను అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలం కావటంతో తాము సమ్మె కు దిగినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులను ఇబ్బందులు పెట్టడం తమ ఉద్దేశం కాదని తెలి పారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారు లు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు. ధర్నాలో జేఏసీ ప్రతిని ధులు బి.కె.వి.ప్రసాద్, ఎం.నిర్మలమూర్తి, రాజేంద్రప్రసాద్, వర్మ పాల్గొన్నారు. నిలిచిన విద్యుత్ సరఫరా విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో తొలిరోజు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో చాలా చోట్ల సరఫరా నిలిచిపోగా ఆదివారం నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికారులు సమాచారం మేరకు విజయనగరం పట్టణంలో మయూరి జంక్షన్, ఇందిరానగర్, ప్రదీప్ నగర్, రైల్వే న్యూకాలనీ తదితర ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది. ఎస్‌కోట డివిజన్లో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగినట్లు తెలుస్తోంది. ఇదే తరహలో మిగిలిన ప్రాంతాల్లో కూడా సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం. ఇదే విషయమై ఏపీఈపీడీసీఎల్ టెక్నికల్ డీఈటీ దైవప్రసాద్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఓ వైపు సమ్మె, మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోవటం వాస్తవమేనన్నారు. సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 245 మంది సిబ్బందిని తీసుకు వచ్చామని మరమ్మ తు పనులు చేపడుతున్నామని వివరించారు.