కెరమెరి : వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఒప్పంద కాలం ఈనెల 30తో ముగియనుంది. వీరిని అలాగే కొనసాగిస్తారా..తొలగిస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఏఏ శాఖల్లో ఉన్నారంటే..
అన్ని మండలాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ, ఉపాధి హామీ పథకం, మున్సిపల్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ఆర్‌వీఎం,లతోపాటు వైద్యఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంలు, జీఎంలు ,సంక్షేమశాఖ హాస్టల్లో కుక్‌లు, కామాటీలు, వాచ్‌మెన్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నెకల్ అసిస్టెంట్లు , కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు.
రాష్ట్రపతిపాలనలో జీవో 84 జారీ
రాష్ర్టపతి పాలనలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసుకు సంబంధించి జీవో నం 84 ను జారీ చేశారు. జూన్ 30 తేదీ వరకు సేవలు వినియోగించుకోవాలని ఉమ్మడి రాష్ర్ట ఖజానా ద్వారానే వేతనాల చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. విభజన జరిగిన త ర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే వీరి కొనసాగింపు ఉంటుందని అందులో స్పష్టం చేశారు. తెలంగాణలోని సిబ్బందిని రెన్యూవల్ చేస్తూ చేస్తూ పొడిగిస్తే తప్పా జూలై 1 నుంచి విధులు నిర్వహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై వేలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి.
ఉంటుందా..ఊడుతుందా..!
Published Sat, Jun 28 2014 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement