కేంద్రం దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
కరీంనగర్ : ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఆధ్వర్యంలో ఇందిరాచౌక్‌లో బుధవారం కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య వన్‌టౌన్ సీఐ విజయసారథి కాంగ్రెస్ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృత్యుంజయం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, జుబేర్, ఉప్పరి రవి, మధు, ముస్తాక్, మూల జైపాల్, మహేశ్, అంజన్‌కుమార్, రాజేందర్, నాగిశేఖర్, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్లేశం, రాంచందర్, సరిళ్లప్రసాద్, కిషన్, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌గౌడ్, అంజయ్యయాదవ్, యూత్‌కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణచౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రవి మాట్లాడుతూ భారత మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం దళితులను కించపరచడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నాయకులు ఎర్ర శ్రీనివాస్, దండి రవీందర్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.