సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ఆదివారం కూడా తమ సమ్మెను కొనసాగించారు. 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తు గాంధీ ఆస్పత్రిలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 200 మంది కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన ఆదివారం ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.