గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ జరగలేదని, కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ గుండెపోటుతోనే మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజా రావు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలి పారు. గాంధీ ఆస్పత్రి సెల్లార్‌లో కొంత మంది కాంట్రాక్టు సిబ్బంది ఈ నెల 16న రాత్రి మందు పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లారని, వారిలో శ్రీనివాస్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఇంటికి వెళ్లిన తర్వాత వేకువజామున మృతి చెందాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలి సిందే. దీంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఐదుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీ సభ్యులుగా ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్ధో పెడిక్, ఆప్తమాలజీ హెచ్‌ఓడీలు సుబోధ్ కుమార్, సత్యనారాయణ, రవిశేఖర్, ఫల్మ నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ నరేంద్ర కుమార్‌లు ఉన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలోని సెమినార్ హాలులో ఘటన జరిగిన రోజు రాత్రి విధులు నిర్వహించిన పలువురు కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో మందు పార్టీ జరగ లేదని ఆస్పత్రి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసిందని ఆస్పత్రి సూపరింటెం డెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment