ఆర్టీసీ సమ్మెతో విధులకు దూరంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరైతే.. వారిని క్రమబద్ధీకరణ చేస్తామని, లేకపోతే విధుల నుంచి తొలగిస్తామని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు.
రాజమండ్రి : ఆర్టీసీ సమ్మెతో విధులకు దూరంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరైతే.. వారిని క్రమబద్ధీకరణ చేస్తామని, లేకపోతే విధుల నుంచి తొలగిస్తామని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. గురువారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రంలోపు విధులకు హాజరు కావాలని.. అలాంటి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేస్తామని రవికుమార్ తెలిపారు.
కాగా ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.