
సాక్షి, తిరువొత్తియూరు: ప్రియుడితో పెళ్లిని అతని తరఫు బంధువులు తిరస్కరించడంతో విరక్తి చెందిన ఓ నర్సు ఆత్మహత్య చేసుకుంది. ఎన్నూరు సునామీ క్వార్టర్స్ 32వ బ్లాక్‌లో నివాసం ఉంటున్న శంకర్ ఆటోడ్రైవర్. ఇతని కుమార్తె సంధ్య (19). తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలోఆమె నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో తాంబరంలోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. గత నెల ఇద్దరు ఇల్లు వదలి వెళ్లిపోయారు. ఫిర్యాదు అందుకున్న ఎన్నూరు పోలీసులు ప్రేమికుల పెద్దలను పిలిపించి మాట్లాడారు.
ఏడాది తరువాత ఇద్దరికి వివాహం చేస్తామని కుటుంబసభ్యులు వారికి నచ్చచెప్పారు. ఈ క్రమంలో గత వారం సంధ్య తిరువణ్ణామలైలో ఉన్న ప్రేమికుడి ఇంటికి తండ్రితో కలిసి వెళ్లి పెళ్లి విషయంపై చర్చించారు. ప్రేమికుడి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పడంతో సంధ్య, ఆమె తండ్రి బాధతో ఇంటికి తిరిగి వచ్చేశారు. దీంతో కొద్ది రోజులుగా మనస్తాపానికి గురైన సంధ్య సోమవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా కాలిన గాయాలపైన సంధ్యను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంధ్య మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment