భోపాల్ : నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 24 గంటల్లోనే మహిళ మృతి చెందిన దారుణ ఘటన మధ్యప్రదశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో చేరింది. ఆ సమయంలోనే తనపై నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్‌గా గుర్తించారు.
వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తన ఉనికిని రహస్యంగా ఉంచాలని, అందువ్ల కేవలం దర్యాప్తు బృందంతో తప్పా మరెవరితోనూ సమాచారం పంచుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఇర్షాద్ వాలి తెలిపారు. గతంలోనూ నిందితుడు మద్యం సేవించి 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా అత్యాచారం చేసి సస్పెండ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన మహిళ 1984 భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఇక హాస్పిటల్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ఏంటని దర్యాప్తు బృందం ప్రశ్నించింది. భద్రతా పరమైన లోపాలున్నాయని పేర్కొంటూ హాస్పిటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసింది.
చదవండి : వ్యాక్సిన్ కోసం వెళ్తే రూ.25 లక్షలు, నగలు దోచుకెళ్లిన దొంగలు
దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment