
పట్నా: తమతో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను నర్సులంతా కలిసి చెప్పులలో చితకబాదారు. వారి నుంచి తప్పించుకొని ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. పరుగెత్తించి మరి కొట్టారు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ ఆస్పత్రిలో జరిగింది.
ఆస్పత్రిలో ఈ మధ్యే ఓ యువతి ట్రైనీ నర్సుగా చేరారు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆమెను అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. అతని ప్రవర్తనతో విసుగెత్తిన ఆ యువతి ఈ విషయాన్ని తోటి నర్సులందరికి చెప్పింది. దీంతో ఆస్పత్రిలోని నర్సులు అంతా కలిసి అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను పరిగెత్తించి.. పరుగెత్తించి కొట్టారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment