ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు దగ్గర నుంచి పురుషుల వరకు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకునేందుకు జిమ్ సెంటర్ల్, డైటింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అయినా బరువు అదుపులోకి రాకపోవడంతో ఎలా తగ్గాలో తెలియక చాలా సతమవుతున్నారు. కానీ కొందరూ మాత్రం కొద్దిపాటి వ్యాయామాలతో అధిక బరువుకి చెక్‌పెట్టి ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ నర్సు. అందరిక తెలిసిన సాధారణ వ్యాయామంతో అధిక బరువుకి చెక్‌పెట్టి ఆశ్చర్యపరచింది ఈ నర్సు. ఆ ఎక్స్‌ర్‌సైజుతో అంత పవర్‌ఫులా ఈజీగా బరువుత తగ్గిపోవచ్చా అంటే..
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 25 ఏళ్ల నర్సు సమంతా అబ్రూ బరువుతో పలు సమస్యలు ఎదుర్కొంది. సుదీర్ఘ నర్సు షిప్ట్‌లతో శరీరం అలసిపోవడంతో తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునేది. అమె ఏ మాత్ర కదలడానికి ఇష్టపడేది కాదు. దీంతో ఆమె ఏకంగా 119 కిలోల బరువుకి చేరుకుంది. ఆస్పత్రుల్లో అధిక బరువుతో ఎదుర్కొంటున్న సమస్యలు చూశాక ఈమెలో అనూహ్యంగా మార్పు వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి ఏ మాత్రం శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడేది కాదు. చిన్నప్పుడూ తన తల్లిదండ్రులు పనిపై బయటికివెళ్తే..ఇదే అదనుగా పిజ్జాలు, బర్గ్‌లు వంటివి ఆర్డర్ చేసుకుని హాయిగా తినేసిది.
చెప్పాలంటే ఆమె మంచి ఫుడ్ లవర్. తినకుండా ఉండలేదు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం అంటే మరింత ఇష్టం. ఇలాంటి ఆమె బరువు తగ్గాలను అనుకుంది. అయితే అప్పుడే కోవిడ్ టైం, లాక్‌డౌన్ ఆంక్షలు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆమె మానసికంగా ధైర్యంగా ఉండేందుకు వాకింగ్ ప్రారంభించింది. ఇది ఆమె బరువు తగ్గడంలో కీలకంగా పనిచేసింది. శరీరాన్ని కష్టపెట్టడం అంటే బయపడే సమంతా అబ్రూ ఈ వాకింగ్ తనకి సులభంగా ఉండే ఈజీ వ్యాయామంగా తోచింది.
దీంతో క్రమ తప్పకుండా సుమారు 5 మైళ్లు వాకింగ్ చేసేది. ఆ తర్వాత నెమ్మదిగా వారానికి నాలుగుసార్లు జిమ్‌లో గడపడం మొదలు పెట్టింది అప్పుడప్పుడూ మూడ్ బాగుంటే పరుగు కూడా పెట్టేది. ఇవి ఆమె దినచర్యలో భాగమయ్యాయి. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 42 కిలోల మేర బరువు అనుహ్యంగా తగ్గిపోయింది. రోజువారీ వాకింగ్, మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు తగ్గడం సులభమేనని ధీమాగా చెబుతోంది నర్సు సమంతా అబ్రు. అంతేగాదు ఇప్పుడూ తన శరీరం తనకు మంచి సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
(చదవండి: మనదేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే! కిచెన్ క్వీన్స్‌గా సత్తా చాటుతున్నారు)
Comments
Please login to add a commentAdd a comment