ప్రేమ వ్యవహారం: చపాతీ కర్రతో నర్సు హత్య | Father Assassinate Nurse Over Love Affair In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తండ్రి చేతిలో నర్సు దారుణ హత్య

Published Sun, Mar 21 2021 12:45 PM | Last Updated on Sun, Mar 21 2021 2:13 PM

Father Assassinate Nurse Over Love Affair In Tamil Nadu - Sakshi

టీ.నగర్‌(తమిళనాడు): మదురై సమీపంలో ఓ ఆస్పత్రి నర్సును కన్నతండ్రి దారుణంగా హతమార్చాడు. మదురై వండియూరు సంగునగర్‌కు చెందిన ఆశైతంబి ఆటోడ్రైవర్‌. ఇతని కుమార్తె మీనాక్షి దేవి (26) అవివాహిత. ఈమె జైహింద్‌పురం ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. మీనాక్షి దేవి ఒకరిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో తండ్రి తీవ్రంగా మందలించాడు.

అయినప్పటికీ మీనాక్షి దేవి ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించడంతో ఆశైతంబికి ఆగ్రహం తెప్పించింది. మీనాక్షిదేవి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆశైతంబి చపాతి కర్రతో ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మీనాక్షి దేవి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: స్నేహ అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని..
ఘోరం: అందరూ చూస్తుండగానే... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement