'ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు' | PM Imran Khan Says Nurses Appeared Like Hoors After Painkiller | Sakshi
Sakshi News home page

'ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు'

Published Wed, Jan 29 2020 8:41 AM | Last Updated on Wed, Jan 29 2020 2:32 PM

PM Imran Khan Says Nurses Appeared Like Hoors After Painkiller - Sakshi

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరు జారడం కొత్తేమీ కాదు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం తరచుగా చూస్తుంటాం. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. మరోసారి నెటిజన్లకు దొరికిపోయారు. ఆ డాక్టరు ఏ ఇంజెక్షన్ ఇచ్చారో కానీ ఆ మందు శరీరంలోకి వెళ్లగానే నా చుట్టూ ఉన్న నర్సులు అందగత్తెలా కనిపించారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయానా పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ప్రసంగిస్తూ.. 2013 ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేజి కూలి నేను గాయపడ్డాను. ఆ సమయంలో నన్ను షౌకత్ ఖానుమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు డాక్టర్ అసీమ్ నాకు ముందుగా ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్‌లోని మందు శరీరంలోకి వెళ్ళగానే నా నొప్పి పోయింది.  (కశ్మీర్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు)

అప్పుడు నా చుట్టూ ఉన్న నర్సులు నాకు అప్సరసల్లా కనిపించారని ఇమ్రాన్ అన్నారు. వారు అలా ముందు నిలబడితే నొప్పి అస్సలు అనిపించేది కాదని పరోక్షంగా వారి అందం గురించి ప్రధాని పొగిడారు. తరువాత ఆసుపత్రి ఆవరణలోనే ఓ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పారు. ప్రధానమంత్రి లాంటి గౌరవ ప్రదమైన పదవిలో ఉండి నర్సులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  (భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement