Hospital doctors
-
కరోనా: ప్రాణాలతో ఆటలు!
సాక్షి, అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికి అధికారులంతా అహరి్నషలు కృషి చేస్తున్నా.. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సర్వజనాస్పత్రి కీలక వైద్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 13కు చేరినట్లు తెలుస్తోంది. ప్రణాళిక లేకపోవడం.. పర్యవేక్షణ కొరవడటంతో సర్వజనాస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్సలు ఇష్టానుసారంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం వాసి కరోనా బారిన పడి మృతి చెందగా.. అతనితో సన్నిహితంగా మెలిగిన వారిని పసిగట్టడంలో ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అందువల్లే పాజిటివ్ కేసులు కొత్తగా పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అనంతపురం రూరల్ మండలంలో గురువారం 55 ఏళ్ల వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి మృత్యువాత పడిన హిందూపురం వాసి అడ్మిషన్లో ఉన్న సమయంలోనే కురుగుంటకు చెందిన వృద్ధుడూ అక్కడే చికిత్స పొందాడనే ప్రచారం జరుగుతోంది. అతను ఈ నెల 7న సర్వజనాస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా... 8న మృతి చెందాడు. దీంతో అధికారులు హుటాహుటిన కురుగుంట గ్రామానికి వెళ్లి, అతను ఏవిధంగా చనిపోయాడన్నదానిపై ఆరా తీశారు. మృతుడు టీబీతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలపడంతో.. మృతుని త్రోట్, న్యాసోఫ్యారింజిల్, తదితర నమూనాలను సేకరించారు. మరోవైపు గురువారం కదిరి ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృత్యువాత పడగా...కరోనా అనుమానంతో మృతదేహం నుంచి త్రోట్, న్యాసోఫ్యారింజిల్ తీశారు. అంతేకాకుండా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందికి పరీక్షలు చేయిస్తున్నారు. గురువారం ఉదయం ఆర్ఎంఓ, వైద్యులు, సిబ్బంది, రోగులకు మొత్తంగా 104 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. పాజిటివ్ కేసులన్నీ సవీరాకు తరలింపు కరోనా పాజిటివ్ కేసులన్నీ నగరంలోని కిమ్స్ సవీరాకు తరలించారు. సర్వజనాస్పత్రిలోని ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌నర్సులు, హిందూపురానికి చెందిన పలువురిని సవీరాలో ఉంచి చికిత్సలు చేస్తున్నారు. క్వారంటైన్‌కు మృతుల కుటుంబీకులు మరణానంతరం కరోనా పాజిటివ్‌గా తేలిన కళ్యాణదుర్గం మానిరేవుకు చెందిన వృద్ధుడి భార్య, పిల్లలను ఐసోలేషన్‌లో, 29 మంది బంధువులు, గ్రామ ప్రజలను క్వారన్టైన్(ఎస్ఆర్ క్వార్టర్స్‌లో) ఉంచారు. అలాగే గురువారం మృత్యువాత పడిన అనంతపురం రూరల్ మండలం కురుకుంటకు చెందిన వృద్ధుడి కుటుంబీకులు ఏడుగురిని ఆరోగ్యశాఖాధికారులు సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారన్‌టైన్‌లో ఉంచారు. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. మాస్కులు అందక వైద్యసిబ్బంది అవస్థలు సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 8న రాత్రి డ్యూటీకి వచ్చిన స్టాఫ్ నర్సులు మాస్క్‌లు అందక గంటన్నరపాటు విధులకు దూరంగా ఉన్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని మాస్క్‌లు అందించారు. -
'ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు'
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరు జారడం కొత్తేమీ కాదు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం తరచుగా చూస్తుంటాం. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. మరోసారి నెటిజన్లకు దొరికిపోయారు. ఆ డాక్టరు ఏ ఇంజెక్షన్ ఇచ్చారో కానీ ఆ మందు శరీరంలోకి వెళ్లగానే నా చుట్టూ ఉన్న నర్సులు అందగత్తెలా కనిపించారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయానా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ప్రసంగిస్తూ.. 2013 ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేజి కూలి నేను గాయపడ్డాను. ఆ సమయంలో నన్ను షౌకత్ ఖానుమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు డాక్టర్ అసీమ్ నాకు ముందుగా ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్‌లోని మందు శరీరంలోకి వెళ్ళగానే నా నొప్పి పోయింది. (కశ్మీర్‌పై ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు) అప్పుడు నా చుట్టూ ఉన్న నర్సులు నాకు అప్సరసల్లా కనిపించారని ఇమ్రాన్ అన్నారు. వారు అలా ముందు నిలబడితే నొప్పి అస్సలు అనిపించేది కాదని పరోక్షంగా వారి అందం గురించి ప్రధాని పొగిడారు. తరువాత ఆసుపత్రి ఆవరణలోనే ఓ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పారు. ప్రధానమంత్రి లాంటి గౌరవ ప్రదమైన పదవిలో ఉండి నర్సులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్) One injection is all it takes for the PM to see nurses as hoors.. pic.twitter.com/syX4hAPxY0 — Naila Inayat नायला इनायत (@nailainayat) January 27, 2020 -
డబ్బు కట్టలేదని అవయవాల దోపిడీ
టీ.నగర్ (చెన్నై): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని చికిత్సకైన ఖర్చును కుటుంబ సభ్యులు చెల్లించలేక పోవడంతో సదరు ఆసుపత్రి ఆ యువకుడి శరీరం నుంచి అవయవాలను కాజేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం పట్టణంలో చోటుచేసుకుంది. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామం తమిళనాడు సరిహద్దుల్లో, పొల్లాచ్చికి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన మణికంఠన్ అనే యువకుడు (24) రోడ్డు ప్రమాదంలో ఇటీవల తీవ్రంగా గాయపడగా సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయే సమయానికి మణికంఠన్ చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చవ్వగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సుకు మరో రూ. 25 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం మణికంఠన్ కుటుంబీకులను కోరింది. ఆ డబ్బును తాము కట్టలేమని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులను మోసం చేసి కొన్ని పత్రాలపై ఆసుపత్రి యాజమాన్యం సంతకాలు చేయించుకుంది. అనంతరం మణికంఠన్ మృతదేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలను తీసుకుంది. `ఈ విషయాన్ని ఇంటికెళ్లాక గుర్తించిన మణికంఠన్ కుటుంబీకులు వెంటనే పాలక్కాడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం సీఎం పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాస్తూ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించారు. కాగా, ఇదే ప్రమాదంలో గాయపడి, బ్రెయిన్‌డెడ్ అయిన మణికంఠన్ అనే మరో యువకుడి నుంచి కూడా ఇదే ఆసుపత్రి వైద్యులు అవయవాలు కాజేసేందుకు ప్రయత్నించారని సమాచారం. -
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం
-
‘టెన్’షన్ లేకుండా..
గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 2 గంటల్లో పది మందికి పురుడు పోసిన వైద్యులు కోల్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిపించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల మధ్యలో పదిమంది గర్భిణులకు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్ సూర్యశ్రీ, మరో గైనకాలజిస్ట్ వనితతోపాటు అనస్తీషియా డాక్టర్ ప్రియాంక కలసి పురుడుపోశారు. పుట్టిన వారిలో ఆరుగురు మగ శిశువులు, నలుగురు ఆడశిశువులు ఉన్నారు. వారికి అప్పటికప్పుడు పీడియాట్రిషన్ డాక్టర్ శిల్ప వైద్యం అందించారు. పది మంది బాలింతలతోపాటు పుట్టిన పది మంది శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ తెలిపారు. అయితే, అనుకోకుండా ఆపరేషన్లు జరిగాయని, రికార్డు కోసం చేయలేదని వెల్లడించారు. పదిమంది గర్భిణుల్లో ఐదుగురు గర్భిణులకు గతంలోనే పెద్ద ఆపరేషన్లు జరిగాయని, మిగిలిన వారికిS సాధారణ ప్రసవం జరిపేందుకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అందరికీ శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
నేరేడ్మెట్లో మేధా హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం
-
ఆస్పత్రిలో అమ్మ కోలుకుంటున్నారు..
-
ఆస్పత్రిలో అమ్మ కోలుకుంటున్నారు..
చెన్నై: తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గురువారం అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం జయలలిత నెమ్మదిగా కోలుకుంటున్నారనీ వైద్యులు తెలిపారు. త్వరలో సీఎంను డిశార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అయితే చికిత్సకు సంబంధించి మరికొన్ని పరీక్షలు చేస్తున్నామనీ, అందుకే మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని సీఎంను తాము కోరినట్టు వైద్యులు తెలిపారు. సీఎం ఆరోగ్యం మెరుగుపడటం లేదంటూ కొందరు దుష్ర్పచారం చేస్తున్నా నేపథ్యంలో చెన్నై పోలీసులు మరోసారి హెచ్చరించారు. సీఎం ఆరోగ్యం విషయంలో దుష్ర్పచారం చేస్తున్న ప్రతిఒక్కరిపై తాము నిఘా పెట్టామనీ, చర్యలు తీవ్రంగా ఉంటాయాని పోలీసులు చెప్పారు. కాగా, గత గురువారం అర్ధరాత్రి సీఎం జయలలితకు జ్వరం తీవ్రస్థాయికి చేరడంతో శుక్రవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల ప్రాంతంలో ఆమెను హడావిడిగా చెన్నై గ్రీమ్స్‌రోడ్డులో అపోలో ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
విషమంగానే ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితి
-
బిల్లు కట్టి బయటకెళ్లండి..!
ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ల ముందే కన్నుమూశారు. ఇక మిగిలింది ఒక్కడే.. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తే ఎంతటి కఠినాత్ముడైనా అయ్యో పాపం అంటారు. కానీ ఆ ఆస్పత్రి యూజమాన్యం మాత్రం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. మృతి చెందిన తన కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్లేందుకు పంపించాలని కోరినా బిల్లు మొత్తం చెల్లించకుంటే పంపించమని మొండికేయడం వైద్య వృత్తికే మాయని మచ్చగా మారింది. ⇒ అంత్యక్రియలకు వెళ్లేందుకు క్షతగాత్రున్ని నిరాకరించిన ఆస్పత్రి యాజమాన్యం ⇒ ఆస్పత్రి వైద్యులతో బంధువుల వాగ్వాదం ⇒ సర్దిచెప్పి పంపించిన పోలీసులు నిజామాబాద్ క్రైం: రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామం వద్ద కారు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కారు నడుపుతున్న విజయ్‌కుమార్ కాలు విరగడంతో అతన్ని నిజామాబాద్‌లోని హైదరాబాద్‌రోడ్డు ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అతని తల్లి, భార్య, కుమారుడు మృతి చెందారు. వారి అంత్యక్రియలకు ఆయన తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి పంపించాలని బంధువులను వైద్యులను కోరారు. అయితే ఆస్పత్రి యూజమాన్యం, సిబ్బంది మాత్రం చికిత్సకు అరుున రూ.70 వేలు చెల్లిస్తేనే పంపిస్తామని మొండికేశారు. అయితే తమ వద్ద అంత మొత్తం లేదని రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. అయినా చికిత్సకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వేయడంపై వారు మండిపడ్డారు. ఓ పక్క కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటే బిల్లు కట్టకుంటే పంపించమని మొండికేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. దీంతో నాల్గవ టౌన్ ఎస్సై మధు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బిల్లు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. చివరకు రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పడంతో బిల్లు కట్టించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. -
గరీబోళ్లంతా గాంధీకే!
మెదక్ ఏరియా ఆస్పత్రి.. 100 పడకల దవాఖాన.. మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, టేక్మాల్, కౌడిపల్లి, చేగుంట మండలాలతో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల వారికి ఏ చిన్న జ్వరమొచ్చినా ఈ ఆస్పత్రికే వస్తారు. రోజుకు ఇక్కడ ఓపీ 400 వరకు ఉంటుంది. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం 20 దాటదు. ఎందుకంటే ఇక్కడి వైద్యులు రోగులతో బంతాట ఆడుకుంటున్నారు. చేయి కూడా పట్టుకోకుండానే పైసలుంటే.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని, గరీబోళ్లయితే గాంధీకి పోవాలని ఉచిత సలహాలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కాదుకూడదంటే మాత్రం సెలైన్ పెట్టి సరిపెడుతున్నారు. దీంతో ఎంతో ఆశతో ఇక్కడికొస్తున్న పేదరోగులంతా పడరానిపాట్లు పడుతున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల ఇష్టారాజ్యం ⇒ డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా కానరాని ఫలితం ⇒ సిబ్బంది లేరంటూ చేతులెత్తేస్తున్న వైనం ⇒ చిన్నపాటి వైద్యానికీ గాంధీకి రెఫర్ మెదక్ టౌన్: ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా.. మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. దీంతో వైద్యులనే దేవుళ్లుగా భావించి ఇక్కడికొస్తున్న పేద రోగులు పడరానిపాట్లు పడుతున్నారు. అత్యవసర సమయంలోనూ వైద్యం అందకపోవడంతో ప్రైవేటు క్లినిక్‌లకు పరుగులు తీస్తున్నారు. పేద ప్రజల సౌకర్యార్థం మెదక్ పట్టణంలో 1999లో అప్పటి ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిని నిర్మించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యాన్ని అందించాలని ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో వైద్యులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి వైద్యులంతా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ..ఆస్పత్రికి వచ్చే రోగులను అక్కడికే రావాలని సూచిస్తున్నారు. పైసల్లేని గరీబోళ్లయితే గాంధీ ఆస్పత్రికి వెళ్లమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాత్రం సిబ్బంది కొరత ఉంటే ఇంత పని ఎట్టా చేసేదంటూ అంతెత్తున లేస్తున్నారు. ఎన్నాళ్లీ సిబ్బంది కొరత మెదక్ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు, జిల్లా వైద్యాధికారులకు ఇప్పటికే ఎన్నోసార్లు విన్నవించినా...ప్రతిపాదనలు పంపినా సమస్య మాత్రం తీరడం లేదు. తెలంగాణ సర్కారైనా సిబ్బంది కొరత తీరుస్తుందని ఆశపడ్డ జనం ఆశలు అడియాశలే అయ్యాయి. రోజుకురోజుకూ ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నా, 1999లో అప్పటి జనా భా ప్రకారం నిర్ణయించిన 12 మంది వైద్యులే ప్రభుత్వం నియమిస్తోంది. దీంతో రోగులకు వైద్యసేవలంద డం లేదు. ఉన్నవారిలోనూ కొద్దిమంది వైద్యులు పైసలకోసం పేద రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపుతున్నారు. ప్రత్యామ్నాయం ఏది? ఇటీవల పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన లక్ష్మి అనే మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే పిల్లల డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో ఆ తల్లి జ్వరంతో అల్లాడిపోతున్న బిడ్డను చూస్తూ సుమారు 2 గంటలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించింది. ఇక్కడి వైద్యులు అసలు పట్టించుకోరని, జ్వరమని వస్తే చేయికూడా పట్టుకోకుండానే గాంధీకి వెళ్లాలని చెప్తారని రోగులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా ఆస్పత్రిని పరిశీలించారు. రోగులను పరామర్శించడంతో పాటు వైద్యులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున 24 గంటల పాటూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కానీ ఆమె ఆదేశాలనూ స్థానిక వైద్యులు బేఖాతర్ చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరుపేదలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నిలువునా మోసపోతున్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా పట్టించుకోని వైద్యులు.. మా అసొంటి పేదోళ్ల మాటను పట్టించు కుంటారా?’ అని పేదజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌కు సిఫార్సు సర్కార్ దవాఖానలో వైద్యం మాట దేవుడెరుగు. గంపెడాశతో వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్యులు, సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోంది. కొరత అనే ఏకైక సాకుతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సర్కార్ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు దర్జాగా ప్రైవేట్ ఆస్పత్రులు నడిపిస్తున్నారు. టెస్టుల పేరుతో పేదల ప్రజల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. అడపా దడపా జిల్లా అధికారులు తనిఖీ చేసినా..ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. కనీస సౌకర్యాలు కరువు పేరుకు 100 పడకల ఆస్పత్రైనా ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా రోగులకు అందడం లేదు. ఫ్యాన్లున్నా అవి తిరగకపోవడంతో రోగులకు దోమలతో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు పరిశుభ్రమైన నీరు కూడా దొరకక రోగులంతా సమీపంలోని దుకాణాల్లో వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగుతున్నారు. ఇక మంచాలైతే మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. పరుపులు చనిగిపోయి పడుకునేందుకు వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని మంచాలకైతే పరుపులే లేకపోవడంతో రోగులు తమవెంట తెచ్చుకున్ని దుప్పట్లు పరుచుకుని వైద్యం పొందుతున్నారు. ఇక రోగులవెంట వచ్చే కుటుంబీకుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వారు ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారంతా చలికి వణుకుతూ ఆస్పత్రి ఆవరణలో పడుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి మెదక్ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల తీరు మారాలంటే...ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యులను సిబ్బందిని ఇతర చోట్లకు బదిలీచేసి...కొత్త వారిని నియమించాలని పట్టణ ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పజలు కోరుతున్నారు. -
కోతల్లేకుండా మెదడులో కణితి తొలగింపు
ఎండోస్కోసీ సహాయంతో చికిత్స నగర వైద్యుల ఘనత సాక్షి, హైదరాబాద్: శరీరంపై కత్తిగాటు లేకుండా... సూది, దారంతో పనిలేకుండా.. కేవలం ఎండోస్కోపీతో కణితిని సిటిజన్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈ చికిత్స వివరాలను ఆసుపత్రి వైద్య బృందం మీడియాకు వివరించింది. నగరంలోని రాజ్భవన్రోడ్డుకు చెందిన మహ్మద్షోయబ్(14) ‘ఆంజియో ఫైబ్రోమా’గా పిలిచే పుర్రెకు సంబంధించిన కణితి (ముక్కు నుంచి రక్తం కారడం) వ్యాధితో బాధపడుతున్నాడు. మూడు నెలల కిందట సిటిజన్స్ ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు ముక్కు, సైనస్ ఎముక, గొంతు వెనకభాగం నుంచి మెదడులోని పుర్రె వరకు 6.5 సెం.మీ. పరిమాణంలో కణితి విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని శస్త్రచికిత్స చేసి కత్తితో తొలగించాల్సి ఉంటుంది. కానీ రైనాలజీ, ఆంకోసర్జరీ, న్యూరో, రేడియాలజీ వైద్యులు బృందంగా ఏర్పడి పది రోజుల కిందట సిటీస్కాన్‌కు నావిగే షన్ పరిజ్ఞానంతో ఎండోస్కోపీ సహాయంతో ముక్కు రంధ్రాల నుంచి కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రతి లక్షమందిలో ఒక రికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలిపారు. -
అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా
తూప్రాన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నిస్టిక్ సెంటర్లపై జిల్లా ఆరోగ్యా శాఖ అధికారిణి పద్మ శుక్రవారం కొరడా ఝళిపించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రులు, రెండు డయాగ్నిస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు. వివరాలు... తూప్రాన్ పట్టణ కేంద్రంలో గల్లికో ఆసుపత్రి వివిధ పేర్లతో కొనసాగుతోంది. అర్హత లేని వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఏకంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. గతంలో తూప్రాన్‌లో ఓ ఆసుపత్రి వైద్యురాలు డెలవరి నిర్వహించి తల్లి, బిడ్డ మృతికి కారకురాలు కావడంతో బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యాధికారులు స్పందించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అయినా ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్న కనీస ధర్మం మరిచి కేవలం డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో పేద రోగులతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై పట్టణ బాధితులు ఫోన్ ద్వారా జిల్లా వైద్యాధికారి పద్మకు ఫిర్యాదు చేయడంతో స్పందించి ఆమె శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఇందులో పోతరాజుపల్లిలోని కేజీఎస్ నర్సింగ్ హోంకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆపరేషన్లు నిర్వహించడంతో సీజ్ చేశారు. అలాగే నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీగీతా నర్సింగ్ హోం, మహాలక్ష్మి నర్సింగ్ హోం, రాఘవేంద్ర ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, సుష్మ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, దేవి నర్సింగ్ హోంలోని ఆపరేషన్ థియేటర్, శివసాయి భవాని ఆసుపత్రి, సాయి కృపా క్లినిక్‌లను సీజ్ చేసి షోకాజ్ నోటీసులు అందజేశారు. అలాగే శ్రీకాంత్ చిల్డ్రన్ ఆసుపత్రికి, శ్రీ సాయి కృష్ణ తూప్రాన్ నర్సింగ్ హోంకు అనుమతుల కాల పరిమితి ముగిసిందన్నారు. వెంటనే అనుమతులు పొందాలన్నారు. లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీలక్ష్మి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు అనుమతులు లేని కారణంగా సీజ్ చేశారు. ఆశాజ్యోతి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు కేవలం అల్ట్రాసౌండ్కు మాత్రమే అనుమతులు ఉండగా ఎక్స్‌రే, ల్యాబ్ నిర్వహిస్తున్న కారణంగా సీజ్ చేసి నోటీసులు అందించామన్నారు. అనుమతులు లేకుండా కొనసాగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ దాడుల్లో జిల్లా వైద్యాధికారి వెంట గజ్వేల్ క్లాస్టర్ అధికారి సేల్వియా, యూడీసీ ప్రేంసాగర్, వైద్యులు సాధన, కృష్ణప్రియ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.