ఆస్పత్రిలో అమ్మ కోలుకుంటున్నారు..
చెన్నై: తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గురువారం అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం జయలలిత నెమ్మదిగా కోలుకుంటున్నారనీ వైద్యులు తెలిపారు. త్వరలో సీఎంను డిశార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అయితే చికిత్సకు సంబంధించి మరికొన్ని పరీక్షలు చేస్తున్నామనీ, అందుకే మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని సీఎంను తాము కోరినట్టు వైద్యులు తెలిపారు.
సీఎం ఆరోగ్యం మెరుగుపడటం లేదంటూ కొందరు దుష్ర్పచారం చేస్తున్నా నేపథ్యంలో చెన్నై పోలీసులు మరోసారి హెచ్చరించారు. సీఎం ఆరోగ్యం విషయంలో దుష్ర్పచారం చేస్తున్న ప్రతిఒక్కరిపై తాము నిఘా పెట్టామనీ, చర్యలు తీవ్రంగా ఉంటాయాని పోలీసులు చెప్పారు. కాగా, గత గురువారం అర్ధరాత్రి సీఎం జయలలితకు జ్వరం తీవ్రస్థాయికి చేరడంతో శుక్రవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల ప్రాంతంలో ఆమెను హడావిడిగా చెన్నై గ్రీమ్స్‌రోడ్డులో అపోలో ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.