మాస్కో : కరోనా రోగులను రక్షించేందుకు అటు వైద్యులతో పాటు ఇటు నర్సులు కూడా నిత్యం పాటుపడుతున్నారు. అయితే ఓ నర్సు చేసిన పనికి ఇప్పుడు వార్తల్లోకెక్కడమే కాక ప్రపంచవ్యాప్తంగా 'హాట్' టాపిక్‌గా మారింది. రష్యాలోని టులా నగరంలోని ఆసుపత్రిలో ఓ ఇరవైయేళ్ల యువతి నర్సుగా సేవలందిస్తోంది. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులతో పాటు నర్సులకు సైతం హాస్పిటల్ యాజమాన్యం పీపీఈ కిట్లను నందించింది. అయితే ఆ యువతికి, తన నర్సు డ్రెస్సుతోపాటు పీపీఈ కిట్లను ధరించడం కష్టంగా తోచింది. వీటన్నింటినీ ధరిస్తే భరించలేని ఉక్కపోతగా ఉందంటూ నర్సు డ్రెస్సును పక్కన పడేసింది. కేవలం బికినీ ధరించి ఆపై పీపీఈ కిట్ వేసుకుంది. (ఆస్పత్రిలో మంటలు : కరోనా బాధితుల మృతి)
పైగా పీపీఈ కిట్ ఎంతో పారదర్శకంగా ఉన్నప్పటికీ ఆ నర్సు అవేమీ పట్టించుకోకుండా కరోనా వార్డుల్లో చికిత్స అందిస్తోంది. ఆమె నిర్ణయానికి ఆసుపత్రి యాజమాన్యం కూడా అడ్డు చెప్పకుండా చూసీ చూడనట్టు ఊరుకుంది. ఇక ఆ నర్సు వేషధారణకు బిత్తరపోయిన ఓ కరోనా పేషెంట్ ఆమెను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఈ విషయం ఆ దేశ ఆరోగ్య శాఖ చెవిన పడటంతో ఆమెపై క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలకు ఆదేశించింది. కాగా మొదట్లో స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరాళ నృత్యం చేసిన కరోనా ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యాలో కేసులు 3 లక్షలు దాటేశాయి.
Comments
Please login to add a commentAdd a comment