Bikini wear
-
కరోనా వార్డు: బికినీలో నర్సు సేవలు
మాస్కో : కరోనా రోగులను రక్షించేందుకు అటు వైద్యులతో పాటు ఇటు నర్సులు కూడా నిత్యం పాటుపడుతున్నారు. అయితే ఓ నర్సు చేసిన పనికి ఇప్పుడు వార్తల్లోకెక్కడమే కాక ప్రపంచవ్యాప్తంగా 'హాట్' టాపిక్‌గా మారింది. రష్యాలోని టులా నగరంలోని ఆసుపత్రిలో ఓ ఇరవైయేళ్ల యువతి నర్సుగా సేవలందిస్తోంది. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులతో పాటు నర్సులకు సైతం హాస్పిటల్ యాజమాన్యం పీపీఈ కిట్లను నందించింది. అయితే ఆ యువతికి, తన నర్సు డ్రెస్సుతోపాటు పీపీఈ కిట్లను ధరించడం కష్టంగా తోచింది. వీటన్నింటినీ ధరిస్తే భరించలేని ఉక్కపోతగా ఉందంటూ నర్సు డ్రెస్సును పక్కన పడేసింది. కేవలం బికినీ ధరించి ఆపై పీపీఈ కిట్ వేసుకుంది. (ఆస్పత్రిలో మంటలు : కరోనా బాధితుల మృతి) పైగా పీపీఈ కిట్ ఎంతో పారదర్శకంగా ఉన్నప్పటికీ ఆ నర్సు అవేమీ పట్టించుకోకుండా కరోనా వార్డుల్లో చికిత్స అందిస్తోంది. ఆమె నిర్ణయానికి ఆసుపత్రి యాజమాన్యం కూడా అడ్డు చెప్పకుండా చూసీ చూడనట్టు ఊరుకుంది. ఇక ఆ నర్సు వేషధారణకు బిత్తరపోయిన ఓ కరోనా పేషెంట్ ఆమెను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఈ విషయం ఆ దేశ ఆరోగ్య శాఖ చెవిన పడటంతో ఆమెపై క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలకు ఆదేశించింది. కాగా మొదట్లో స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరాళ నృత్యం చేసిన కరోనా ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యాలో కేసులు 3 లక్షలు దాటేశాయి. (ప్రపంచంపై కరోనా పంజా) -
బికినీలు.. ఇండియాలో జాన్తా నై!
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకులపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ టూరిస్ట్‌లు తమ దేశంలో తిరిగినట్లు.. భారత్‌లో తిరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. తాజాగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్ కోర్స్.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోం. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. విదేశీయులతోపాటు మనవాళ్లు కూడా దానికి భంగం కలిగించకూడదు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. అలాగని చీరలు కట్టుకునే ఇక్కడికి రావాలని విదేశీయులకు తాను చెప్పటం లేదని.. ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా మెదిలితే చాలని, మన ప్రజలు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు కూడా కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ విదేశీ పర్యాటకులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు ఆయన సలహా ఇచ్చారు. -
బికినీ సుందరి!
నటీమణులు బికినీ దుస్తులు ధరించడానికి ఒకప్పుడు భయపడేవారు. ముఖ్యంగా ప్రముఖ కథానాయికలు తమ ఇమేజ్‌కి భంగం కలుగుతుందేమోనని ఈత దుస్తులు ధరించడానికి ససేమిరా అనే వారు. ఇక టూపీస్ దుస్తులు నర్తకీమణులే ధరించి అంగాంగ ప్రదర్శనలతో కుర్రకారును ఉర్రూతలూగించేవారు. అయితే ఈ సంస్కృతి రానురాను కథానాయకిలకు పాకింది. బికినీలు ధరించడానికి హీరోయిన్లు అధిక పారితోషికం డిమాండ్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లే ఐటమ్ గర్ల్‌గా మారిపోతున్నారు. అజిత్ బిల్లా చిత్రంలో నేటి టాప్ హీరోయిన్ నయనతార, సంచలన నటి నమిత ఈత దుస్తుల్లో పోటీ పడి కనిపించారు. ఆ తరువాత అలాంటి సన్నివేశాల్లో హీరోయిన్లు నటించడం అన్నది చాలా సర్వసాధారణం అయ్యిందనే చెప్పాలి. నటి రాయ్‌లక్ష్మీ విషయానికి కొస్తే ఒకప్పుడు హీరోయిన్. ఇప్పుడు ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా మారిపోయారు.అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తన కెరీర్‌ను బిజీగా ఉండేలా చూసుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ మధ్య తెలుగులో చిరంజీవితో సింగిల్ సాంగ్‌కు చిందేసిన రాయ్‌లక్ష్మి తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి సందర్భం వస్తే మాత్రం చక్కగా ఉపయోగించుకుంటుందీ భామ. తాజాగా రాయ్‌లక్ష్మి నటిం చిన హిందీ చిత్రం జూలీ–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో అమ్మడు అందాలారబోతలో ఇరగదీసిందట. టూపీస్ దుస్తుల్లో రకరకాల భంగిమల్లో స్విమ్ చేసి యువతను గిలిగింతలు పెట్టనుందట. జూలీ–2 చిత్ర ప్రచారంలో భాగంగా రాయ్లక్ష్మీనే స్వయంగా టూపీస్ దుస్తులు ధరించిన తన ఫొటోను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫొటో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. యువత అధికంగా లైక్ చేయడమే కాకుండా ఇతర హీరోయిన్ల ఈత దుస్తుల ఫొటోలను కూడా ఇంటర్నెట్లో పోస్ట్ చేసి ఏ నటి టాప్ అనే కాంటెస్ట్‌ను కూడా నిర్వహిస్తుండడం విశేషం. మొత్తం మీద రాయ్‌లక్ష్మీ ఈతదుస్తుల దృశ్యం యువతకు పెద్ద పనే పెట్టిందన్నమాట.