ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పొరపాటున బ్లేడు కోసుకుంటేనే బాధను తట్టుకోలేం.. అలాంటిది కత్తెరతో వేలినే కత్తిరించినపుడు.. అదీ పది రోజుల పసికందుకు జరిగితే.. ఆ పసిప్రాణం విలవిల్లాడుతుంది.. ఈ లోకంలోకి వచ్చీరాగానే నరకం చూసింది. ఈ సంఘటన సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బసంత్ సహాని ఆస్పత్రిలో జరిగింది. పదిరోజుల ఆడశిశువు చిటికెన వేలును నర్సు నిర్లక్ష్యంగా కత్తిరించేసింది.
బోయిన్‌పల్లి సర్వదామనగర్‌కు చెందిన సూర్యకాంత్, అంబిక భార్యాభర్తల కుమార్తె బాధితురాలిగా మిగిలింది. పుట్టిన కవల పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం డిచ్చార్జి చేసేందుకు సిద్దమయ్యారు. శిశువుకు చేతికి వేసిన బ్యాండేజ్‌ను తొలగిస్తూ సుమలత అనే నర్సు పాప వేలిని కట్‌చేసింది. చిటికెన వేలు కొంతభాగం ముక్క తెగిపడింది. దీంతో ఒక్కసారిగా బంధువులు ఆందోళనకు గురై ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో నర్సు అక్కడి నుంచి పరారైంది. పాప చేతి వేలికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment