తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి.. | Nurse Sends Bathroom Videos Of Colleagues To Boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడికి సహోద్యోగుల బాత్‌రూం వీడియోలు పంపిన నర్సు

Published Mon, Dec 21 2020 4:18 PM | Last Updated on Mon, Dec 21 2020 4:44 PM

Nurse Sends Bathroom Videos Of Colleagues To Boyfriend - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు : ప్రియుడితో బంధాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో తప్పుదారి పట్టిందో నర్సు. తోటి ఉద్యోగుల బాత్‌రూం వీడియోలను తీసి ప్రియుడికి పంపింది. గుట్టురట్టయి చివరకు జైలు పాలైంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన అశ్వినికి ఓ రాంగ్‌ కాల్‌ ద్వారా తమిళనాడు వేల్లూర్‌కు చెందిన ప్రభు అనే చెఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఓ రెండు మూడు సార్లు కలుసుకున్నారు. అయితే ఆమెకు ఇది వరకే రెండు సార్లు పెళ్లైందని, విడాకులు కూడా తీసుకుందని‍ ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టసాగాడు. బంధంలో రెండు సార్లు విఫలమైన ఆమె, అతడ్ని  వదులుకోవటనానికి ఇష్టపడలేదు. అతడు చెప్పినట్లుగా నడుచుకునేది. (దారుణం: చూస్తుండగానే దడేల్‌, దడేల్‌!)

ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని అడిగాడు. ఆమె అలాగే పంపేది. అతడికి అవి బోర్‌ కొడుతున్నాయని చెప్పటంతో హాస్టల్‌ గదిలో తనతో పాటు ఉంటున్న తోటి ఉద్యోగులు స్నానం చేస్తునపుడు తీసిన వీడియోలను అతడికి పంపేది. ఓ రోజు బాత్‌రూంలో స్నానం చేయటానికి వెళ్లిన ఓ సిబ్బంది అక్కడ కిటికీ దగ్గర సెల్‌ఫోన్‌ ఉండటం గమనించింది. దీనిపై అశ్వినిని ‍ప్రశ్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు చాలా వరకు నర్సుల బాత్‌రూం వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement