గర్భధారణకు ప్లాన్ చేసుకోవడానికి ముందుగా ఒకసారి ఆ దంపతులు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. చాలామంది ఈ పని చేయరు. కానీ డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. అంతకు మునుపు తాము ఏవైనా మందులు వాడుతున్నామా అన్న విషయాలను డాక్టర్‌కు చెప్పాలి. ఎందుకంటే ఏదైనా జబ్బు కోసం వాడుతున్న మందులను కాబోయే తల్లి వాడితే అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
ఉదాహరణకు గుండెజబ్బుల కోసం వాడే కొన్ని మందులు గర్భధారణ సమయంలో కాబోయే మాతృమూర్తికి అవి సరిపడినా... వాటి వల్ల బిడ్డకు హాని జరగవచ్చు. అలాగని బిడ్డకు ప్రమాదకరమనే నిర్ణయాన్ని తామే తీసుకుని తమంతట తామే మందులు మానేస్తే అది కాబోయే తల్లికి మరింత హాని చేకూర్చవచ్చు.
ఇక థైరాయిడ్, హైబీపీ, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఫిట్స్ వంటి జబ్బులకోసం వాడే మందులను గర్భవతిగా ఉన్న సమయంలో వారికి (అంటే తల్లికీ, బిడ్డకూ ఇద్దరకీ) పూర్తిగా సురక్షితమైనవే వాడాల్సి ఉంటుంది. అవి సురక్షితమైనవే అని తెలియాంటే పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భం రాకముందుగా పై జబ్బుల కోసం వాడే మందులను గర్భం వచ్చాక తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ పై మందులు వాడుతూనే గర్భం కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు... కాబోయే తల్లికి గర్భం వచ్చిందన్న విషయమే రెండో మాసం వరకు (మొదటి నెల గడిచేవరకు) తెలియకపోవచ్చు. అందుకే గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు తమకు ఉన్న వైద్య చరిత్రను (ప్రీ–మెడికల్ హిస్టరీని) డాక్టర్‌కు తప్పనిసరిగా చెప్పాలి. ( చదవండి : ఫేషియల్ పెరాలసిస్‌కు భయపడకండి! )
Comments
Please login to add a commentAdd a comment