గద్వాల : ఓ గర్భిణీ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా గద్వాల మండల పరిధిలోని పూడూరు ఎర్రవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూడూరు ఎర్రవల్లి గ్రామానికి చెందిన జయశ్రీ, పరశురాముడు భార్యాభర్తలు.
జయశ్రీ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్త పరశురాముడు వెంటనే తేరుకొని మంటలను ఆర్పేశాడు. 108 ద్వారా జయశ్రీని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్సై సత్యనారాయణ తెలిపారు.