సాక్షి,రామగుండం(కరీంనగర్): ప్రజాపాలనలో నిత్యం బిజీగా ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్ సకాలంలో స్పందించి గర్భిణీకి మంగళవారం ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన దుస్స రమ్యకృష్ణ అనే గర్భిణికి పురుటి నొప్పులు ఎక్కువకావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రెండోకాన్పుకోసం తీసుకొచ్చారు.
పరీక్షించిన వైద్యులు ప్రసవంకోసం ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయింది. వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. కంట్రోల్ కాలేదు. వెంటనే విషయాన్ని సీనియర్ జనరల్ సర్జన్ అయిన నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్‌కు తెలిపారు. సకాలంలో స్పందించిన మేయర్ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు చేరుకుని, సదరు గర్భిణికి శస్త్రచికిత్స చేశారు.
ఆపరేషన్ సక్సెస్‌కావడంతో పండంటి బాబుకు రమ్మకృష్ణ జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్‌కుమార్, కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్‌ను ఆస్పత్రి వైద్యులతోపాటు రమ్యకృష్ణ కుటుంబసభ్యులు అభినందించారు. డాక్టర్లు శౌరయ్య, శ్రవంతి, కళావతితోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం
Comments
Please login to add a commentAdd a comment