యర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా): బావి దగ్గర బట్టలు ఉతుకుతున్న తొమ్మిది నెలల గర్భిణీ ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పాతగోపులాపురం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాతగోపులాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగేశ్వరి(22)లకు ఏడాది క్రితం వివాహమైంది. ఆంజనేయులు గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. కాగా శనివారం నాగేశ్వరి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని బావి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే కాలు జారి బావిలో పడి మృతి చెందింది. నిండు గ ర్భిణీ కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.