108లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి పరిస్థితి విషమించి కన్నుమూసింది.
పాలకొండ (శ్రీకాకుళం) : 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం సాంబం పంచాయతీ బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ(22) ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు శ్రీకాకుళం రెఫర్ చేశారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద గర్భిణీ కన్నుమూసింది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.