కాబుల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అరాచకాలు మొదలెట్టారు. పైకి మాత్రం తాలిబన్ల నాయకులు మారిపోయినట్లు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వారు గతంలో మాదిరిగానే తమ సహజ ప్రవర్తనను బయటపెడుతున్నారు. తాజాగా 6 నెలల గర్భవతిగా ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారిణిని దారుణంగా హత్యచేశారు. ఆమెను కుటుంబసభ్యుల ఎదుటే ఆమెను కిరాతకంగా తుపాకితో కాల్చిచంపారు.
ఘోర్ ప్రావిన్సుల రాజధాని ఫిరోజ్కొ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యగావించబడ్డ మహిళ జైలు అధికారిణి బాను నెగర్‌గా స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే అఫ్గన్ మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతుండగా తాజాగా ఈ హత్య కలకలం రేపింది. బుర్ఖాలు లేకుండా కనిపిస్తే తాలిబాన్లు వేటాడతారని, కొడతారనే భయంతో మహిళలు ఇప్పటికే వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు.
దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ప్రభుత్వ ఏర్పాటులో హక్కులు, మహిళా ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు హెరాత్‌లో నిరసన ప్రదర్శనలు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసి అధికారులు తాలిబన్లు ఎక్కడ చంపుతారోనని బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతున్నారు.
చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment