
భర్త జలాల్‌ఖాన్‌తో యాంకర్ గౌతమి
హైదరాబాద్: నేను తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను.కామన్ ఫ్రెండ్ ద్వారా జలాల్‌ఖాన్ ఫోన్‌లో పరిచయమయ్యారు. ఆరు నెలలు కనీసం కలుసుకోలేదు. సంవత్సరం తర్వాత ప్రపోజ్ చేశాడు. అప్పటికే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. తర్వాత ఓ రోజు ఇంటికి వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడాడు. కానీ.. ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ఏడాది పట్టింది. ఇప్పుడు మాకో పాప. ఇప్పటివరకు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగింది. మతాలు వేరైనా సంప్రదాయాలను గౌరవించుకుంటాం.
ఆయన ప్రతిరోజు నమాజ్ చేస్తారు. నేను పూజ చేసి దీపం పెడతాను. అలా మా ఇంట్లో రంజాన్, సంక్రాంతి రెండూ జరుపుకుంటాం. అలవాట్లు, ఆలోచనలు, పద్ధతులను ఇబ్బంది పెట్టనంత కాలం.. ప్రేమ ప్రియంగానే ఉంటుందని నా అభిప్రాయం. పాప పుట్టాక మా బంధం ఇంకా బలపడింది. ఈసారి వాచ్ గిఫ్ట్‌గా ఇస్తున్నాను. బిజినెస్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే తనకు.. ఆ వాచ్ చూసినప్పుడు నేను, పాప ఇంట్లో వేచిచూస్తున్నామని గుర్తు చేసేందుకే ఈ ప్లాన్. – గౌతమి, యాంకర్
Comments
Please login to add a commentAdd a comment