Valentines Day Marriage: Siddipet Boy Married Nepal Girl | అక్కన్నపేట అబ్బాయి.. నేపాల్‌ అమ్మాయి - Sakshi
Sakshi News home page

అక్కన్నపేట అబ్బాయి.. నేపాల్‌ అమ్మాయి

Published Mon, Feb 15 2021 11:04 AM | Last Updated on Mon, Feb 15 2021 3:58 PM

Siddipet Groom Marriages Nepal Girl On Valentines Day - Sakshi

సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్‌): వారి ప్రేమ దేశ ఎల్లలు దాటింది. వివాహ బంధంతో ఒక్కటిని చేసింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వారు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమికుల దినోత్సవం రోజుల ఏడడుగులు నడిచి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. అక్కన్నపేట అబ్బాయి.. నేపాల్‌ అమ్మాయి వివాహ వేడుక అక్కన్నపేట మండలం మసిరెడ్డితండాలో ఆత్మీయుల మధ్య ఆదివారం జరిగింది. తండాకు చెందిన మాలోతు లక్ష్మి– బద్యి దంపతుల చిన్న కుమారుడు రమేశ్‌. ఎనిమిది ఏళ్ల క్రితం ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లాడు.

ఎంఎస్‌ పూర్తి చేశాక ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరి అక్కడే స్థిరపడ్డాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో నేపాల్‌ అమ్మాయి (కుమారి)తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి ఆరు నెలల క్రితం అమెరికాలో  రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. కాగా కుటుంబ సభ్యుల కోరిక మేరకు మసిరెడ్డితండాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆదివారం ఒక్కటయ్యారు. చూడముచ్చటైన ఈ కొత్త జంటను చూసేందుకు తండావాసులు తరలివచ్చి ఆశీర్వదించారు. 
చదవండి: చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తాం?
తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్‌ హల్‌చల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement