
మళ్లీ ‘కాంజీవరం’ కాంబినేషన్!
‘కాంజీవరం’ గుర్తుందా? ప్రకాశ్‌రాజ్‌కు ఉత్తమ నటునిగా జాతీయ పురస్కారం తీసుకొచ్చిన తమిళ చిత్ర మిది. ఇందులో చేనేత కార్మికునిగా ఆయన నటన ప్రశంసలందుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ దీనికి సృష్టికర్త. ‘కాంజీవరం’ తర్వాత ప్రకాశ్‌రాజ్-ప్రియదర్శన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ప్రియదర్శన్ చెప్పిన కథ విని ప్రకాశ్‌రాజ్ విపరీతంగా ఇంప్రెస్ అయ్యారట. త్వరలోనే మొదలుకానున్న ఈ సినిమాకు ‘కాంజీవరం’ టీమ్‌లోని టెక్నీషియన్లు చాలామంది పనిచేయనున్నారట. ఆ వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.