గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయా..
విడాకులు పొందలేక పోయామనే చింతను నటి లిజి వ్యక్తం చేశారు. కమలహాసన్‌కు జంటగా విక్రమ్ చిత్రంతో పాటు పలు భాషల్లో కథానాయకిగా నటించిన నటి లిజి. ఆమె మలయాళ దర్శకుడు ప్రియదర్శిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రియదర్శన్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా ప్రియదర్శిన్, లిజిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాలు సంసారం చేసిన వారి మధ్య మనస్పర్థలు కలగడంతో గత ఏడాది విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు.
అంతకు ముందు చాలా మంది శ్రేయోభిలాషులు లిజి, ప్రియదర్శిన్‌ల మధ్య సమోధ్యకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా గురువారం వీరు చట్టబద్దంగా కోర్టులో విడాకులను పొందారు. దీని గురించి నటి లిజి ఒక ప్రకటనలో పేర్కొంటూ దర్శకుడు ప్రియదర్శిన్‌తో తన వివాహ జీవితం ఈ రోజుతో ముగిసిపోయిందన్నారు. కుటుంబ సంక్షేమ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో తామిద్దరం హాజరై విడాకుల పత్రాలను అందుకున్నామన్నారు.
ఇటీవల బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-సుస్సేన్, విజయ్-అమలాపాల్ వంటి వారు సామరస్యపూర్వకంగా చర్చించుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. అలాంటిది తమ విషయంలో అది అందుకు భిన్నంగా జరిగిందన్నారు. తమ మధ్య తరచూ గొడవలు జరిగాయన్నారు. ప్రస్తుతం అలాంటి వాటి నుంచి బయట పడ్డానని పేర్కొన్నారు. కఠినమైన జీవితం నుంచి ఇది వేరే విధంగా నిర్ణయం జరిగిందని, అలా గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయామని నటి లిజి అన్నారు.