అలా కలిశారు | Thala Ajith visits director Priyadarshan in Hyderabad | Sakshi
Sakshi News home page

అలా కలిశారు

Feb 17 2019 6:42 AM | Updated on Feb 17 2019 6:42 AM

Thala Ajith visits director Priyadarshan in Hyderabad - Sakshi

ప్రియదర్శన్, అజిత్‌

తమిళ నటుడు అజిత్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందా? అనే సందేహం రాకమానదు ఇక్కడున్న ఫొటో చూస్తే. కానీ అందుకు టైమ్‌ ఉంది. మరి... అజిత్‌–ప్రియదర్శన్‌ కలిసి ఎక్కడ మాట్లాడుతున్నారు? అనే మీ డౌట్‌. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో. మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ‘మరక్కార్‌: ది అరేబియన్‌ కండలింటే సింహమ్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే అజిత్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ హిట్‌ ‘పింక్‌’ తమిళ రీమేక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సేమ్‌ ప్లేస్‌లో షూటింగ్‌ జరుగుతోంది. దాంతో అజిత్‌ ‘మరక్కార్‌’ సెట్‌లోకి వెళ్లారట. అక్కడ ప్రియదర్శన్‌–అజిత్‌ ముచ్చటించుకుంటున్న టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement