
కీర్తీ సురేశ్
సినిమా సినిమాకు యాక్టర్స్ సరికొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తూనే ఉంటుంది. తాజాగా ‘మరక్కార్: అరబికడలింటే సింహం’ సినిమా కోసం వీణ వాయించడం నేర్చుకున్నారు కీర్తీ సురేశ్. మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కీర్తీ అతిథి పాత్రలో నటించారు. కీర్తీ పాత్ర గురించి దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మరక్కార్’ సినిమాలో క్లాసికల్ సంగీతం నేర్చుకున్న విద్వాంసురాలిగా కీర్తీ కనిపిస్తారు. ఆమె పాత్రే కథలో ఓ మలుపు తీసుకొస్తుంది.
మరక్కార్ ఫ్రెండ్ చినాలి అనే వ్యక్తితో కీర్తీ ప్రేమలో పడుతుంది. జనరల్‌గా పాత్రని వివరించగానే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం అనే దానికంటే ఎలాంటి అవుట్ పుట్ తీసుకురావాలా అని కీర్తీ ఆలోచిస్తుంది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడి వీణ వాయించడం నేర్చుకుంది. వీణ నేర్చుకోవడం అంత సులభం కాదు. సెట్లో ప్రతీ నోట్ కరెక్ట్‌గా వాయించింది. ఇప్పటికీ ఫస్ట్ సినిమా లో చూపించిన ఉత్సాహాన్నే చూపిస్తోంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. విశేషం ఏంటంటే కీర్తీ ఫస్ట్ మలయాళం సినిమా ‘గీతాంజలి’కి ప్రియదర్శన్ దర్శకుడు, మోహన్‌లాల్ హీరో. ‘మరక్కార్’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment