'సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా'.. విశ్వక్‌సేన్ మాస్ ట్రైలర్ వచ్చేసింది! | Tollywood Hero Vishwak Sen Latest Movie Mechanic Rocky Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Mechanic Rocky Trailer: కంప్యూటర్‌ సైన్స్‌తో సివిల్ ఇంజినీర్‌ అవుతావా?.. మాస్ ట్రైలర్ వచ్చేసింది!

Published Sun, Oct 20 2024 5:36 PM | Last Updated on Sun, Oct 20 2024 5:43 PM

Tollywood Hero Vishwak Sen Latest Movie Mechanic Rocky Trailer Out Now

టాలీవుడ్ యంగ్ హీరో మెకానిక్ రాకీ అంటూ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరితో హిట్‌ కొట్టిన మాస్‌ కా దాస్‌ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‍లోని మూసాపేట్‌లో ఉన్న శ్రీరాములు థియేటర్‌లో మెకానిక్ రాకీ ట్రైలర్‌ 1.0ను లాంఛ్‌ చేశారు. ట్రైలర్ చూస్తే మరోసారి మాస్ పాత్రలో విశ్వక్‌సేన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెకానిక్ పాత్రలో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అంతే కాకుండా మాస్ యాక్షన్‌తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ రివీల్ చేశారు.

కాగా.. ఈ చిత్రంలో సునీల్, వీకే నరేష్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెకానిక్ రాకీ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement