ప్రేక్షకులకి బోర్‌ కొట్టిస్తున్నాం: నాని | Nani unveils the hilarious trailer for Priyadarshi Darling | Sakshi

ప్రేక్షకులకి బోర్‌ కొట్టిస్తున్నాం: నాని

Jul 16 2024 12:56 AM | Updated on Jul 16 2024 12:56 AM

Nani unveils the hilarious trailer for Priyadarshi Darling

‘‘ఈ మధ్య సినిమాల్లో యాక్షన్‌ ఎక్కువైపోయి ప్రేమకథలు, వినోదం చాలా మిస్‌ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నిరకాల జానర్స్‌ మూవీస్‌ వచ్చేవి.. అన్నింటినీ ఎంజాయ్‌ చేసేవాళ్లం. థియేటర్స్‌కి వెళ్లడానికి ఎక్కువ కారణాలుండేవి. కానీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒకే జానర్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్‌ కొట్టిస్తున్నాం. అందరం కామెడీ, లవ్‌స్టోరీ, ఎమోషనల్, యాక్షన్‌.. ఇలా అన్ని జానర్స్‌ టచ్‌ చేయాలి. ప్రియదర్శిలాంటి ప్రతిభ ఉన్న నటుడు వైవిధ్యమైన జానర్స్‌ ఎంచుకోవడం గర్వంగా ఉంది’’ అని హీరో నాని అన్నారు.

ప్రియదర్శి, నభా నటేష్‌ జోడీగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల కీలక పాత్ర చేశారు. కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ–‘‘డార్లింగ్‌’ మూవీ టీజర్, ట్రైలర్‌ చాలా వినోదాత్మకంగా ఉంది. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ కావాలి. ‘హను–మాన్‌’ మూవీ స్థాయిలో ‘డార్లింగ్‌’ విజయం సాధించాలి.

వివేక్‌ సాగర్‌ మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ చూస్తే అశ్విన్‌ రామ్‌ ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తోంది. నభా నటేశ్‌.. ప్రమాదం తర్వాత నీ కొత్త అధ్యాయం ‘డార్లింగ్‌’ తో ప్రారంభమైంది. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. తన నటన, చేసే పాత్రలు ఇష్టం. అందుకుని ‘డార్లింగ్‌’ ఈవెంట్‌కి రాలేదు. నాకు ఇష్టమైన ‘బలగం’ మూవీ హీరో అని, ‘బలగం’ మూవీ అభిమానిగా వచ్చా. ‘బలగం’ స్థాయిలో ‘డార్లింగ్‌’ విజయం సాధించాలి.

ఈ మూవీ తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవాలి. నా వాల్‌పోస్టర్‌ ప్రొడక్షన్‌లో నేను నిర్మించనున్న తర్వాతి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తాడు. జగదీశ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్‌ నరేశ్‌ రామదురై, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల, అనన్య నాగళ్ల, డైరెక్టర్స్‌ వీఐ ఆనంద్, వేణు యెల్దండి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement