జస్ట్ చిల్! | hero sushanth new movie ready to release | Sakshi
Sakshi News home page

జస్ట్ చిల్!

Published Tue, Aug 2 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

జస్ట్ చిల్!

జస్ట్ చిల్!

సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. జస్ట్ చిల్.. అనేది ఉపశీర్షిక. సోనమ్ ప్రీత్ బజ్వా కథానాయిక. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో అడ్వంచరస్ జర్నీలా సాగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

ఈ వారంలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో శిల్పకళా వేదికలో ఆడియో, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మురళీశర్మ, పోసాని, వెన్నెల కిశోర్, రఘుబాబు, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, కూర్పు: గౌతంరాజు, కెమేరా: దాశరథి శివేంద్ర.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement