‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకునితో సుశాంత్ కొత్త సినిమా | shushanth new film with 'venkatadri express' director | Sakshi
Sakshi News home page

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకునితో సుశాంత్ కొత్త సినిమా

Published Thu, Jul 24 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

సుశాంత్ - మేర్లపాక గాంధీ

సుశాంత్ - మేర్లపాక గాంధీ

గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి తనయుడైన మేర్లపాక గాంధీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నారు. శ్రీ నాగ్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే గాంధీ చక్కటి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ప్రస్తుతం కథానాయిక, ఇతర తారాగణం ఎంపికలో దర్శక, నిర్మాతలు బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement