హీరో సుశాంత్‌కు పితృవియోగం
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు రెండో కుమార్తె, నాగార్జున సోదరి నాగ సుశీల భర్త, హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన జూబ్లీ హిల్స్‌లోని స్వగృహంలో గుండె పోటుతో మరణించారు.
వాస్తవానికి నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక గురువారం జరగాల్సింది. కానీ, సత్యభూషణరావు మృతితో వాయిదా వేశారు. పలువురు సినీ ప్రముఖులు సత్యభూషణరావు మృతిపట్ల తమ సంతాపం తెలిపారు.