
నటుడు అజిత్ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయం వెలువడినా ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకీ కారణం చెప్పలేదు కదూ! నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్రం పేరేమిటి? అది ఎలా ఉండబోతోంది, ఎప్పుడు తెరపైకి రాబోతోంది అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ తన 61వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, జీ సీనిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళం నటి మంజు వారియర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర టైటిల్, పస్ట్ లుక్ పోస్టర్లను బుధ, గురువారాల్లో వరుసగా విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి ‘తునివు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి నో గట్స్ నో గ్లోరి అనే ట్యాగ్ లైన్ జోడించారు.
#THUNIVU first look #Ajith #ajithkumarfans #Ajithkumar𓃵 pic.twitter.com/Dpl3b2n13B
— Narinder Saini (@Narinder75) September 21, 2022