
బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం డాక్టర్ జి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక నిర్మాత తనకు బ్లాంక్ చెక్ ఇస్తే తిరస్కరించినట్లు చెప్పారు. 'లక్ష్మీ సే పహలే సరస్వతి ఆతీ హై' (లక్ష్మి కంటే సరస్వతి ముఖ్యం) అని అన్నట్లు తెలిపారు. ఒక సినిమాకు ఒప్పుకున్నాక అదే నాకు ముఖ్యమని ఆయన వెల్లడించారు. ఒక నిర్మాత ఆయనను సంప్రదించి బ్లాంక్ చెక్ ఇచ్చి మూడు సినిమాలు చేయమని అభ్యర్థించారని తెలిపారు.
ఆయుష్మాన్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చి.. ‘ఎంత కావాలంటే అంత తీసుకోండి. మాతో మూడు సినిమాలు చేయండి' అని ఆఫర్ చేశారని అన్నారు. దీనికి వెంటనే నాకు డబ్బుల కంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యమని ఆయనతో తేల్చి చెప్పానని వివరించారు. తన హిట్ సినిమాలన్నీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్‌తో చేసినవే అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. మొదటిసారి దర్శకులు చాలా బాగా సహకారంతో ఉంటారని చెప్పుకొచ్చారు. కాబట్టి అలాంటి వారితో పని చేయడం చాలా సులభంగా, సరదాగా ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment