
పాత్రలకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేసే అతి కొద్దిమంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. చిత్రం సక్సెస్ అయినా, ప్లాప్ అయినా నటుడిగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇటీవల ఆయన నటించిన కోబ్రానే తీసుకుంటే ఆ చిత్రం ఆశించిన విధంగా ఆడలేదన్నది నిజం. అయితే ఆ చిత్రానికి విక్రమ్ పెట్టిన ఎఫర్ట్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. చిత్రంలో గెటప్‌ల కోసమే ఎంతో సమయాన్ని కేటాయించారు.
ప్రస్తుతం నటిస్తున్న తంగలాన్ చిత్రం విషయానికి వస్తే మరోసారి విక్రమ్ తన మార్కు చూపనున్నారని ఆయన గెటప్ చూస్తేనే తెలిసిపోతోంది. దీనికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన చిత్రాలు కచ్చితంగా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటాయన్నది తెలిసిందే. ‘తంగలాన్’ చిత్రానికి ఆయన 18వ శతాబ్దం కాలపు నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం విశేషం. దీంతో ఆ కథకు తగ్గట్టుగా విక్రమ్ మారిపోయారు. నటి పార్వతి, మాళవికా మోహన్ నాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలె సెట్స్‌పైకి వచ్చి శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇది కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల్లో బానిసలుగా పని చేస్తున్న కార్మికులకుల ప్రధానాంశంతో తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేజీఎఫ్ గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా షూటింగ్ అనంతరం విక్రమ్ కేజీఎఫ్ గనుల్లో పనిచేసే తమిళ కార్మికులను కలిసి వారితో ముచ్చటించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment