విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది! | Vijay Antony Next Film First Look Released | Sakshi
Sakshi News home page

Vijay Antony: విజయ్ ఆంటోనీ మూవీ.. 'విక్రమ్ రాథోడ్' ఫస్ట్ లుక్ రిలీజ్!

Published Tue, Jun 13 2023 9:42 PM | Last Updated on Tue, Jun 13 2023 9:46 PM

Vijay Antony Next Film First Look Released   - Sakshi

విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. 

(ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!)

అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

(ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement